మంత్రి పదవి కి రాజినామా చేయనున్న టీడీపీ మంత్రి       2018-05-11   02:02:37  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు కి త్వరలో బిగ్ షాక్ తగలనుందా ..? సాక్షాత్తు ఏపీ మంత్రి చంద్రబాబుని, టీడీపీ పార్టీ ని వీడ బోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో ఏపీ మంత్రి ఒకరు తన మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది..ఇంతకీ ఎవరు ఆ మంత్రి ఏమిటా కధ అనే వివరాలలోకి వెళ్తే..పాత కధే అయినా ఇప్పటి టీడీపి ప్రభుత్వ పరిస్థితికి మాత్రం ఇది అతిపెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

ఏపీ రాజకీయాల కంటే కూడా నంద్యాల రాజకీయాలు ఎంతో భిన్నంగా ఉంటాయి..అయితే చంద్రబాబు కి ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ ఇప్పడు నంద్యాల రాజకీయాలని మార్చేయబోతోంది…ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది…ఒకప్పుడు భూమా కుటుంబానికి ఎంతో ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి భూమా మరణం తరువాత మాత్రం ఆ ఫ్యామిలీకి దూరం అయ్యారు. అయితే ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిలకు మధ్య నడుస్తున్న రాజకీయ వివాదం అంతకంతకూ ముదిరిపోతుందని చెబుతున్నారు..చంద్రబాబు ఎంత ఘాటుగా వార్నింగ్ ఇచ్చినా సరే వీరిద్దరి పరిస్థితిలో మార్పురాలేదు

అయితే తమ ఫ్యామిలీ కి దూరంగా ఉంటూ మా పై నిందలు వేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి కి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పడంతో మంత్రి భూమా అఖిల ప్రియ బగ్గుమంది..దాంతో ఏవీకి పదవి ఇచ్చిన పక్షంలో తాను కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్న సందేశాన్ని ఏకంగా చంద్రబాబు కే పంపింది ఈ వార్త ఇప్పుడు టీడీపీ వర్గాలలో తీవ్రమైన కలకలం రేపుతోంది.. ఇంతకీ.. భూమా అఖిల తీసుకునే కీలక నిర్ణయం ఏమిటి..అనే విషయానికి వస్తే..అఖిలప్రియ తన మంత్రి పదవిని వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై ఎటువంటి అధ్కారిక ప్రకటన రాకపోయినప్పటికీ…సన్నిహితుల అభిప్రాయం ప్రకారం భూమా అఖిల పార్టీ మారేందుకు కూడా సిద్దంగా ఉందనే టాక్ వినిపిస్తోంది..అంతేకాదు ఏవీతో రాజీ అన్నది లేదని తేల్చి చెప్తోంది అఖిల ప్రియ..అంతేకాదు పార్టీ మారడంపై కూడ నిర్ణయం తీసుకోవడానికి సగం కారణం మాత్రం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.ఎందుకనే బాబు సర్కారుపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో.. పార్టీ మారే అంశంపైనా సంప్రదింపులు లోగుట్టుగా సాగుతున్నాయని తెలుస్తోంది..అయితే అఖిల ప్రియ పార్టీ మారే ఆలోచన పై మరింత క్లారిటీ వస్తేనే కానే పూర్తి వివరాలు బయటికి వచ్చేలా లేవు అంటున్నారు విశ్లేషకులు .