'భోళా శంకర్' కోసం డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్న చిరు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇప్పటికీ తన డాన్స్ స్టెప్పులతో ఫ్యాన్స్ కు మతిపోగొడుతున్నాడు.

 Bhola Shankar Movie Latest Update-TeluguStop.com

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Acharya, Bhola Shankar Movie, Bhola Shankar Movie Latest Update, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh Movie, Vedalam Movie Remake-Movie

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసుకుంటుంది.ఇక ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తుండగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఇక ఈ సినిమా అలా ఉండగానే చిరు పుట్టిన రోజునాడు మూడు కొత్త సినిమాలు ప్రకటించి ఫాన్స్ ను ఖుషీ చేసాడు.మెగా స్టార్ ప్రకటించిన సినిమాల్లోభోళా శంకర్’ సినిమా ఒకటి.

 Bhola Shankar Movie Latest Update-భోళా శంకర్’ కోసం డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్న చిరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది తమిళ సినిమా అయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా వస్తుంది.

మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది.ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

వచ్చే వారం ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇక మెహర్ రమేష్ సినిమాలంటే హీరోలను ఎంత స్టైలిష్ గా చూపిస్తారో తెలిసిన విషయమే.

ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేయబోతున్నట్టు టాక్.

Telugu Acharya, Bhola Shankar Movie, Bhola Shankar Movie Latest Update, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh Movie, Vedalam Movie Remake-Movie

భోళా శంకర్ పాత్ర కోసం చిరు డిఫెరెంట్ లుక్ లో కనిపించ బోతున్నారట.ఆ మధ్య సోషల్ మీడియాలో చిరంజీవి గుండు లుక్ వైరల్ అయినా విషయం తెలిసిందే.ఆ లుక్ ఈ సినిమాలోనిదే అని ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ లుక్ తో పాటు మరొక డిఫెరెంట్ లుక్ కూడా ఈ సినిమాలో ఉండబోతుందని సమాచారం.ఆ క్రేజీ లుక్ ఏంటో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు కు చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

#Bhola Shankar #Bhola Shankar #Acharya #Vedalam #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube