హీరోయిన్‌ స్టే చేస్తున్న హోటల్‌ రూంలోకి వెళ్లిన యువకుడు.. గంట పాటు రచ్చ రచ్చ చేశాడు  

Bhojpuri Actress Titu Sing Big Reveals About Accused Pankaj Yadav-pankaj Yadav,telugu Viral News,viral In Social Media,పంకజ్‌ యాదవ్‌,రీతూ సింగ్‌

సెలబ్రెటీల ప్రైవేట్‌ లైఫ్‌ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వారు ఎటైనా బయటకు వెళ్లాలి అంటే ముసుగు వేసుకుని మరీ వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైన బయట ముసుగు లేకుంటే కనిపిస్తే వారిపై జనాలు ఏ స్థాయిలో పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

హీరోయిన్‌ స్టే చేస్తున్న హోటల్‌ రూంలోకి వెళ్లిన యువకుడు.. గంట పాటు రచ్చ రచ్చ చేశాడు-Bhojpuri Actress Titu Sing Big Reveals About Accused Pankaj Yadav

ఇక హీరోయిన్‌ బయట కనిపిస్తే ఆకతాయిలు టచ్‌ చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తారు. కొందరు అయితే ఏకంగా వారిపై పడిపోతారు. అలా ఒక ఆకతాయి అభిమాని కారణంగా హీరోయిన్‌కు గంట పాటు గుండె ఆగినంత పనైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… భోజ్‌పురికి చెందిన ఒక హీరోయిన్‌ రీతూ సింగ్‌ తాజాగా షూటింగ్‌ నిమిత్తం వారణాసి వెళ్లింది. వారణాసిలో షూటింగ్‌ ముగించుకున్న తర్వాత ఒక హోటల్‌లో ఆమె బస ఏర్పాటు చేయడం జరిగింది. హోటల్‌లో రీతూ సింగ్‌ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అనూహ్యంగా పంకజ్‌ యాదవ్‌ అనే యువకుడు హోటల్‌ రూంలోకి దూరాడు. హోటల్‌లో సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి అతడు హీరోయిన్‌ రూంలోకి వెళ్లాడు.

అతడు రూంలోకి రావడంతో వెంటనే రీతూ సింగ్‌ అలారమ్‌ మోగించింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడు రీతూ సింగ్‌ను బలవంతం చేయడం మొదలు పెట్టాడు. నన్ను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు..

బయట ఉన్న ఒక బాయ్‌ రూంలోకి వెళ్లి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా పంకజ్‌ యాదవ్‌ అతడిపైకి కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాంతో తుపాకి హీరోయిన్‌ రీతూ సింగ్‌కు గురి పెట్టి ఆమెను చంపి, తాను చస్తానంటూ బెదిరించాడు. పోలీసులు అలాగే ముందుకు వెళ్లడంతో ఒక పోలీస్‌ పైకి కూడా కాల్పులు జరిపాడు.

దాదాపు గంట పాటు ఈ రచ్చ జరిగింది. ఆ తర్వాత అతడిని పోలీసులు ఎలాంటి ప్రమాదం జరుగకుండా అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా పంకజ్‌ యాదవ్‌ హీరోయిన్‌ రీతూ సింగ్‌ను ఇలా వేదించాడట. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పంకజ్‌ యాదవ్‌ తాను చాలా కాలంగా రీతూ సింగ్‌ను ప్రేమిస్తున్నట్లుగా చెబుతున్నాడు.