ఆత్మహత్య చేసుకుంటా అంటున్న హీరోయిన్  

Bhojpuri actress Rani Chatterjee under depression, Bollywood, Tollywood, Social Media Threaten, Suicide Attempt - Telugu Bhojpuri Actress Rani Chatterjee Under Depression, Bollywood, Social Media Threaten, Suicide Attempt, Tollywood

సెలబ్రిటీలు ఫ్యాన్స్ కి అందుబాటులో ఉందామనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటేన్ చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో ద్వారా రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ వారి కెరియర్ కి సంబందించిన విషయాలు పంచుకుంటారు.

 Bhojpuri Actress Rani Chatterjee Under Depression

అయితే కొంత మంది ఆకతాయిలు ఫ్యాన్స్ ముసుగులో వారిని ఫాలో అవుతూ హీరోయిన్స్ మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం, వేధింపులకి గురి చేయడం, అసభ్యపదజాలంతో దూషించడం చేస్తూ ఉంటారు.అయితే ఏదో ఆకతాయిగా చేస్తున్నారని కొంత మంది హీరోయిన్స్ వదిలేసిన వారి ఆగడాలు మరీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి.

తమ కామెంట్స్ కి రెస్పాన్స్ ఇవ్వకపోతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మరీ బెదిరిస్తూ ఉంటారు.

ఆత్మహత్య చేసుకుంటా అంటున్న హీరోయిన్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు అలాంటి బెదిరింపుల కారణంగా తనకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ ఓ హీరోయిన్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది.

ప్ర‌ముఖ భోజ్‌పురి న‌టి రాణీ చ‌ట‌ర్జీ తాను వేధింపులు తాళ‌లేకున్నాన‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.త‌న వేధింపుల‌కు కార‌ణ‌మైన వ్య‌క్తి ఎవ‌రో కూడా వెల్ల‌డించింది.

ఫేస్‌బుక్‌లో ధ‌నంజ‌య్ సింగ్ అనే వ్య‌క్తి నాపై వేధింపుల‌కు పాల్పడుతున్నాడు.లావుగా ఉన్నావు, ముస‌లిదానా అంటూ నోటికొచ్చిన‌ట్లు తిడుతున్నాడు.

ఇవే కాదు, మాట‌ల్లో చెప్ప‌లేని, రాయ‌డానికి వీలు కాని అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతున్నాడు.కొన్నేళ్లుగా ప‌ట్టించుకోకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను.

కానీ నా వ‌ల్ల కావ‌డం లేదు.తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్నాను.

నేనేదైనా అఘాయిత్యం చేసుకుంటే ధ‌నుంజ‌య్ సింగే కార‌ణం అని పేర్కొంది.అయితే ధనుంజయ్ పెట్టిన పోస్టులలో ఆమె పేరు ప్రస్తావించకపోవడంతో అతనిపై యాక్షన్ తీసుకోలేమని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

మరి ఆమె ఆవేదనకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది చూడాలి.

#Suicide Attempt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bhojpuri Actress Rani Chatterjee Under Depression Related Telugu News,Photos/Pics,Images..