భీష్మ ఏకాదశి ప్రత్యేకత ఏమిటో తెలుసా..?  

Do you know what is special about Bhishma Ekadashi , bhishma ekadasi, Sivakeshavula, pooja, Gangadevi - Telugu Bhishma Ekadasi, Gangadevi, Pooja, Sivakeshavula

తెలుగు నెలలు ఎంతో పవిత్రమైన పదకొండవ మాసమే మాఘమాసం.ఈ మాఘ మాసంలో భక్తులు పెద్ద ఎత్తున ఆ శివకేశవులకు పూజలను నిర్వహిస్తారు.

TeluguStop.com - Bhishma Ekadashi

ఈ మాఘ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశి “భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు.అదేవిధంగా భీష్ముడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కావడంతో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.

భీష్మ ఏకాదశి ని”జయ ఏకాదశి”, మహా ఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు.అయితే ఈ భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

TeluguStop.com - భీష్మ ఏకాదశి ప్రత్యేకత ఏమిటో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గంగాదేవి స్త్రీ రూపం ధరించినప్పుడు అష్టవసువులు ఆమెకు పుట్టిన ఏడవ సంతానమే భీష్ముడు.పురాణాలలో భీష్ముడుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.చిన్ననాటి నుంచి ఎంతో గొప్ప త్యాగశీలి అయిన భీష్ముడు తన తండ్రి కోసం సుఖాన్ని, రాజ్యాన్ని సైతం వదులుకున్నాడు.తన తండ్రి కోసం రాజ్యాన్నే వదులుకున్న భీష్ముడు వివాహం చేసుకున్న తర్వాత తన పిల్లలు తను చేసిన త్యాగానికి అడ్డు పడతారేమో అని భావించి వివాహం కూడా చేసుకోలేదు.11 రోజుల పాటు యుద్ధం నిర్విరామంగా చేయడంవల్ల ఎంతో గాయపడిన భీష్ముడు దక్షిణాయన కాలంలో మరణించడం ఇష్టంలేక 58 రోజులపాటు అంపశయ్యపై పడుకొని, ఉత్తరాయణ కాలంలో మరణిస్తాడు.ఈ విధంగా తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న మహాపురుషుడు భీష్ముడు అని చెప్పవచ్చు.

Telugu Bhishma Ekadasi, Gangadevi, Pooja, Sivakeshavula-Telugu Bhakthi

భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూడటానికి శ్రీ కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడిని చూసిన అమితానందంతో సహస్ర నామాలతో కీర్తిస్తాడు.ఆ విధంగా మాఘ శుద్ధ అష్టమినాడు భీష్ముడు ప్రాణాలు వదిలాడు.అప్పటినుంచి భీష్ముడు మరణం తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు.ఈ భీష్మ ఏకాదశి రోజు విష్ణుసహస్రనామం పఠిస్తే అనుకున్న కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి.

భోగభాగ్యాలు కలిగి సకల పాపాలు తొలగిపోతాయి.అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలని చెబుతారు.

#Bhishma Ekadasi #Sivakeshavula #Gangadevi #Pooja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU