వర్మని ఫాలో అవుతున్న ఫ్లాప్ నిర్మాత ఏటీటీ అంటున్నాడు

థియేటర్లు మూత పడటంతో ఇప్పుడు అందరూ డిజిటల్ బాట పట్టారు.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని కూడా ఒటీటీ ప్లాట్ ఫాం ద్వారా రిలీజ్ అయిపోతున్నాయి.

 Bhimavaram Talkies Introduces Att System, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

ఇక సినిమాలకి ఇక్కడ మంచి కలెక్షన్ కూడా వస్తుంది.దీంతో ఒటీటీ సంస్థలు కూడా డిజిటల్ రైట్స్ కూడా నిర్మాతలకి భారీగానే ముట్టజెబుతున్నారు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి.రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఓటీటీకి ప్రత్యామ్నాయంగా రామ్ గోపాల్ వర్మ ఏటీటీ అని కొత్త ప్లాట్ ఫామ్ తీసుకొచ్చాడు.ఎనీటైమ్ థియేటర్ అనే ఈ ప్లాంట్ ఫామ్ లో సినిమా రిలీజ్ చేసేటపుడు డబ్బులు చెల్లించి సినిమా వీక్షించే వెసులుబాటు ఉంది.

లాక్ డౌన్ టైంని ఉపయోగించుకొని ఆర్జీవీ తనకి అలవాటైన చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూ వాటిని ఎటీటీ ద్వారా రిలీజ్ చేస్తూ భాగానే డబ్బులు దండుకున్తున్నాడు.ఆర్జీవీ ప్లాన్ భాగా నచ్కాడంతో ఇప్పుడు వంద చిత్రాలకి పైగా నిర్మించిన ఫ్లాప్ నిర్మాత రామసత్యనారాయణ కూడా తన ప్రొడక్షన్ హౌస్ భీమవరం టాకీస్ పేరు మీదుగానే ఎటీటీ స్టార్ట్ చేసేసారు.

ఆర్జీవీ ఐడియా తనకి నచ్చి అమలు పరుస్తున్నట్లు తాజాగా తెలిపాడు.ఈ ఎటీటీ ద్వారా ఏకంగా 90 సినిమాల వరకు విడుదలకి సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు.మొత్తానికి భీమవరం టాకీస్ లో తెరకెక్కిన అన్ని సినిమాలని రామసత్యనారాయణ మరల ఏటీటీ ద్వారా ప్రేక్షకుల మీదకి వదులుతున్నట్లు తెలుస్తుంది.మరి ఆర్జీవీ సినిమాలకి వచ్చినట్లు ఇతని సినిమాలకి ఏమైనా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయో లేవో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube