పవన్ కళ్యాణ్ మీద సంచలన ఆరోపణలు చేసిన గ్రంధి శ్రీనివాస్  

పవన్ కళ్యాణ్ పై సంచలన వాఖ్యలు చేసిన గ్రంధి శ్రీనివాస్. .

Bhimavaram Mla Grandhi Srinivas Sensational Comments On Pawan Kalyan-grandhi Srinivas Sensational Comments,janasena,pawan Kalyan,ysrcp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికలలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు గాజువాక, ఇటు భీమవరంలో వైసీపీ అభ్యర్ధుల చేతిలో పవన్ కళ్యాణ్ ఘోర పరాభవం చవిచోసాడు. రెండు చోట్ల పవన్ కళ్యాణ్ మూడో స్థానానికి పడిపోవడం చూస్తూ ఉంటే అక్కడ కనీసం పవన్ నమ్ముకున్న సామాజిక వర్గం ఓట్లు కూడా అతనికి పెద్దగా పడలేదని అర్ధమవుతుంది..

పవన్ కళ్యాణ్ మీద సంచలన ఆరోపణలు చేసిన గ్రంధి శ్రీనివాస్-Bhimavaram MLA Grandhi Srinivas Sensational Comments On Pawan Kalyan

ఇదిలా ఉంటే ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ డబ్బులు పంచకుండా జెరో బడ్జెట్ పోలిటిక్స్ ని మొదటి సారి తెర మీదకి తీసుకొచ్చి తాను అనుకున్న దానిలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద భీమవరంలో గెలిచినా వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేసాడు. పవన్ కళ్యాణ్ జెరో బడ్జెట్ పోలిటిక్స్ అని బయటకి చెప్పిన కూడా భీమవరం మాత్రం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని, అలాగే మద్యం కూడా ఇచ్చారని, అయిన కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ ని నమ్మలేదని సంచలన వాఖ్యలు చేసారు.

ఇక పవన్ కళ్యాణ్ తన మీద చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలు అని భీమవరం ప్రజలు నిరూపించారని గ్రంధి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. మరి గ్రంధి శ్రీనివాస్ వాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది వేచి చూడాలి.