భీష్మ వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు  

Bheeshma Worldwide Pre Release Business Details - Telugu Bheeshma, Nithiin, Pre Release Business, Rashmika Mandanna, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Bheeshma Worldwide Pre Release Business Details - Telugu Nithiin Rashmika Mandanna Venky Kudumula

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

కాగా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు అమ్ముడయ్యి చిత్ర నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.నితిన్ పవర్ ప్యా్క్ పర్ఫార్మెన్స్‌తో పాటు రష్మిక అందాలు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.ఇక ఈ సినిమాను కొన్న బయ్యర్లు కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఇక భీష్మ సినిమా ట్రైలర్ చూస్తే ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందిందని తెలుస్తోంది.ఈ సినిమాలో నితిన్-రష్మికల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటున్నారు.

ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 6.30 కోట్లు

సీడెడ్ – 3.06 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.85 కోట్లు

గుంటూరు – 1.55 కోట్లు

ఈస్ట్ – 1.55 కోట్లు

వెస్ట్ – 1.20 కోట్లు

కృష్ణా – 1.40 కోట్లు

నెల్లూరు – 0.64 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 17.50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు

ఓవర్సీస్ – 2.40 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ – 23.50 కోట్లు

తాజా వార్తలు

Bheeshma Worldwide Pre Release Business Details-nithiin,pre Release Business,rashmika Mandanna,venky Kudumula Related....