మిలియన్ మార్కు కోసం పోరాడుతున్న భీష్మ

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ, ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

 Bheeshma Trying Hard To Hit Million Mark-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో ఈ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

నితిన్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్న ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దుమ్ములేపింది.

ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా రెండు వారాలు ముగిసే సరికి ఏకంగా $964కె వసూళ్లు సాధించింది.

మిలియన్ మార్క్‌ను ఈ సినిమా అవలీలగా చేరుతుందని అందరూ అనుకున్నారు.కానీ అమెరికాలోనూ కరోనా ఎఫెక్ట్‌ ఉండటంతో సినిమా థియేటర్లకు జనం రావడం తగ్గించారు.

దీంతో ఈ సినిమా మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవాలంటే మరో $36కె కలెక్ట్ చేయాల్సి ఉంది.

నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూఎస్‌లో మిలియన్ మార్క్‌ను టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube