రైతులని టచ్ చేసిన భీష్మ... ట్రైలర్ టాక్  

Bheeshma Trailer Represent Farmer Story - Telugu Bheeshma Trailer, Hero Nithin, Rashmika Mandana, Represent Farmer Story, Tollywood

నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కి త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం భీష్మ.ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ఈ సినిమా ఉండబోతుంది అని మొదటి నుంచి సినిమా టీజర్, సాంగ్స్ చూసిన వారు అనుకుంటూ వచ్చారు.

Bheeshma Trailer Represent Farmer Story - Telugu Hero Nithin Rashmika Mandana Tollywood

ఇక రష్మిక తో హీరో రొమాన్స్, టైటిల్ కూడా దానికి తగ్గట్లే రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫీల్ తెప్పించింది.అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో దర్శకుడు ప్రేక్షకులకి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

అదే వ్యవసాయం, రైతుల ఎలిమెంట్.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు రైతుల ఎలిమెంట్ ని ఎక్కువగా తీసుకొని హిట్స్ కొడుతున్నారు.

రైతులతో కథ లింక్ అయితే ఎమోషన్ భాగా వర్క్ అవుట్ అవుతుంది.అందుకే దర్శకుడు వెంకీ కుడుముల ఆ ఎలిమెంట్ తో ఈ సినిమా కోసం వాడుకున్నాడు.

రసాయిన ఎరువులుతో తయారు చేసిన విత్తనాలతో తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తి పొందాలని అనుకునే విలన్ కి సేంద్రీయ ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసే సంస్థ భీష్మకి మధ్య తలెత్తిన వైరం ఎంత వరకు వెళ్ళింది.దీనిలో నితిన్, విలన్ తో ఎందుకు తలపడ్డాడు.

రైతులకి భీష్మ కంపెనీ చేసే మేలు ఏంటి అనే ఎలిమెంట్స్ తో ట్రైలర్ తో చూపించడం ద్వారా సినిమా శైలి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని దర్శకుడు ముందే చెప్పేసాడు.ఎలిమెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది కాబట్టి నితిన్ కి భీష్మతో హిట్ పడే అవకాశాలు ఉన్నాయని ట్రైలర్ చూసిన తర్వాత అర్ధమవుతుంది.

తాజా వార్తలు

Bheeshma Trailer Represent Farmer Story-hero Nithin,rashmika Mandana,represent Farmer Story,tollywood Related....