అఆ తర్వాత నితిన్‌కు ఆ అరుదైన ఘనత  

Bheeshma To Cross 1.5million Dollars Mark - Telugu Bheeshma, Bheeshma Movie Collections, Bheeshma Movie Review, Nithin, Rashmika

నితిన్‌ ‘భీష్మ’ చిత్రంతో ఎట్టకేలకు సక్సెస్‌ కొట్టాడు.ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.

Bheeshma To Cross 1.5million Dollars Mark

ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం నిలవడంతో ప్రస్తుతం సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బయ్యర్లకు బ్రేక్‌ ఈవెన్‌ను సాధించి పెట్టడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో రాబడుతున్న వసూళ్లు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా చేసిన ‘అఆ’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో అసలు సత్తా చాటిందే లేదు.

అక్కడ మిలియన్‌ మార్క్‌ను సాధించిన నితిన్‌ మళ్లీ ఇన్నాళ్లకు భీష్మ చిత్రంతో అక్కడ మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేయడం కన్ఫర్మ్‌గా కనిపిస్తుంది.సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు గత నెల రోజులుగా అక్కడ సినిమాలు లేకపోవడంతో నితిన్‌ సినిమాను ఓవర్సీస్‌ ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.

మొదటి రెండు రోజుల్లో ఆరు లక్షల డాలర్లను వసూళ్లు చేసింది.ఆదివారం నాడుతో మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేయడం ఖాయం అంటున్నారు.ఇక ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో ఏకంగా 1.5 మిలియన్‌ డాలర్లను రాబట్టనుందని ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

భారీ ఎత్తున సక్సెస్‌ దక్కించుకున్న ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌లో టాప్‌ చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bheeshma To Cross 1.5million Dollars Mark-bheeshma Movie Collections,bheeshma Movie Review,nithin,rashmika Related....