తుక్కు రేగ్గొట్టిన భీష్మ.. యూఎస్ కలెక్షన్ల వివరాలు  

Bheeshma Overseas Collections - Telugu Bheeshma, Nithiin, Overseas Collections, Rashmika Mandanna, Venky Kudumula

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ రిలీజ్ రోజునే మంచి టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్‌లో మరో సూపర్ హిట్‌ మూవీని అందుకున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.

Bheeshma Overseas Collections

కాగా ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ ప్రేక్షకులను సైతం అలరిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు అక్కడ మంచి బజ్ క్రియేట్ కావడంతో రిలీజ్ రోజున ఈ సినిమా అక్కడ కూడా తుక్కు రేగ్గొట్టింది.

‘అ.ఆ’ సినిమాతో మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న నితిన్, భీష్మ సినిమాతో ఆ ఫాలోయింగ్‌ను కంటిన్యూ చేస్తు్న్నాడు.ఈ సినిమాకు ఓవర్సీస్‌లో, ముఖ్యంగా యూఎస్‌లో మంచి కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ఈ సినిమాకు 143 లొకేషన్లలో ప్రీమియర్ షోలో భాగంగా $94,244 కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక శుక్రవారం ఈ సినిమాకు 113 లొకేషన్లకుగాను $65కె వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ వీకెండ్ ముగిసే సరికి భీష్మ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్వరసాగర్ మహతి సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేశారు.

#Venky Kudumula #Nithiin #Bheeshma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bheeshma Overseas Collections Related Telugu News,Photos/Pics,Images..