కుమ్మేస్తున్న భీష్మ.. అప్పుడే సగం కొల్లగొట్టాడు!

దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన తాజా చిత్రం భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యింది.యంగ్ హీరో నితిన్, అందాల భామ రష్మికలు కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Bheeshma Nears Half Million Dollar Mark In Us-TeluguStop.com

ఇక నితిన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో, ఓవర్సీస్‌లో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది.

ఇక భీష్మ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుక అక్కడి జనాలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం భీష్మ విజయం సాధించడంతో ఈ సినిమా అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రీమియర్స్ ద్వారా భీష్మ చిత్రం 143 లొకేషన్స్‌లో $94,744 వసూళ్లు సాధించగా, శుక్రవారం 144 లొకేషన్స్ నుండి $151,697 వసూళ్లు సాధించింది.ఇక శనివారం రాత్రి 10.15 నిమిషాల వరకు ఈ సినిమా 136 లొకేషన్స్‌లో $234,564 కలెక్ట్ చేసింది.

ఈ వసూళ్లు మొత్తం $481,005 గ్రాస్ కలెక్షన్స్‌గా నిలవడంతో భీష్మ చిత్రం శనివారం పూర్తి లెక్కలు బయటపడే వరకు హాఫ్ మిలియన్ మార్కును అవలీలగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇక తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా ఎంతమేర వసూళ్లు సాధిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube