మళ్లీ వస్తామంటున్న భీష్మ కాంబో..?  

Bheeshma Combo To Repeat Again - Telugu Bheeshma, Nithiin, Rashmika Mandanna, Telugu Movie New, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Bheeshma Combo To Repeat Again - Telugu Bheeshma, Nithiin, Rashmika Mandanna, Telugu Movie New, Venky Kudumula-Gossips-Telugu Tollywood Photo Image

వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాకు నిర్మాతలు అనుకున్న బడ్జెట్‌ కంటే కూడా ఎక్కువ కావడంతో నిర్మాతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.కానీ తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్‌లో నిర్మాతలకు ఏకంగా రూ.10 కోట్ల లాభం రావడంతో వారు సంతోషంగా ఉన్నారట.ఇప్పుడు ఈ సినిమాకు అదిరిపోయే బజ్ రావడంతో ఈ సినిమా ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని చిత్ర యూనిట్ ఆశగా ఎదురుచూస్తోంది.కాగా మరోసారి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్ నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అనుకున్నట్లుగా భారీ లాభాలను తెచ్చిపెడితే భీష్మ కాంబో రిపీట్ కావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాతో నితిన్ ఎలాంటి బ్లాక్‌బస్టర్ అందుకుంటాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

Bheeshma Combo To Repeat Again-nithiin,rashmika Mandanna,telugu Movie New,venky Kudumula Related....