భీష్మ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?  

Bheeshma Censor Report And Run Time - Telugu Bheeshma, Nithiin, Rashmika Mandanna, Telugu Movie News, Tollywood Gossips, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మరికొద్ది రోజుల్లు రిలీజ్‌కు రెడీ అయ్యింది.దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నితిన్ మరో అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Bheeshma Censor Report And Run Time - Telugu Nithiin Rashmika Mandanna Movie News Tollywood Gossips Venky Kudumula

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.ఇటీవల తెలుగు సినిమాలకు ‘యు’ సర్టిఫికెట్ రాలేదనే అసంతృప్తిని భీష్మ సినిమా తీర్చేసింది.

ఇక ఈ సినిమాకు ఒక్క కత్తెర కూడా పడలేదు.సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉందని, ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆనందిస్తారని సెన్సార్ సభ్యులు కితాబిచ్చారు.

ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలకు ఫిక్స్ అయ్యింది.ఈ సినిమా నితిన్, రష్మికల కెరీర్‌లో ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.

సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు

Bheeshma Censor Report And Run Time-nithiin,rashmika Mandanna,telugu Movie News,tollywood Gossips,venky Kudumula Related....