భీష్మ 6 రోజుల కలెక్షన్లు.. ఎంత రాబట్టాడంటే?

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఛలో సినిమాతో తన సత్తా చాటిన వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఆయన రూపొందించాడు.

 Bheeshma 6 Days Collections-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నితిన్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో ఈ సినిమా చూసేందుకు వారు థియేటర్లకు ఎగబడ్డారు.

అటు అందాల భామ రష్మిక కూడా ఈ సినిమాలో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తిని చూపించారు.

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన భీష్మ, తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.23.16 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

ఈ సినిమా ఫుల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు సాధిస్తుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇక ఈ సినిమా ఏరియాలవారీ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 7.65 కోట్లు

సీడెడ్ – 2.79 కోట్లు

నెల్లూరు – 0.59 కోట్లు

కృష్ణా – 1.19 కోట్లు

గుంటూరు – 1.52 కోట్లు

వైజాగ్ – 2.48 కోట్లు

ఈస్ట్ – 1.45 కోట్లు

వెస్ట్ – 1.07 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 18.74 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 23.16 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube