ఇప్పుడు ‘భీష్మ’ను పట్టించుకునేది ఎవరు?  

Bheesha Promotion Are Late - Telugu Bheesha, Bheeshma Latest Update, Bheeshma Pree Release Event, Nithin And Rashmikha Mandhana, Nithin Bheeshma

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.సినిమా విడుదలకు ముందు పాజిటివ్‌ బజ్‌ వచ్చినా కూడా సినిమా విడుదల తర్వాత నిరాశ పర్చడంతో అంతా కూడా చల్లబడి పోయారు.

Bheesha Promotion Are Late - Telugu Bheesha, Bheeshma Latest Update, Bheeshma Pree Release Event, Nithin And Rashmikha Mandhana, Nithin Bheeshma-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పుడు అందరి దృష్టి భీష్మ చిత్రంపై ఉంది.నితిన్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తే తప్ప ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు.అలాంటిది భీష్మ చిత్రాన్ని హీరో నితిన్‌ అంటీ ముట్టనట్లుగా ప్రమోట్‌ చేస్తున్నాడు.ఆయన పెళ్లి కారణంగా సినిమా గురించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను ఆయన లైట్‌ తీసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ప్రస్తుతం సినిమాకు పెద్దగా బజ్‌ లేదు.ప్రమోట్‌ చేస్తేనే ఏమైనా జనాల్లో చర్చ జరిగి బజ్‌ క్రియేట్‌ అవుతుంది.

సినిమాలో రష్మిక నటించడం వల్ల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే నితిన్‌ మాత్రం సినిమా ప్రమోషన్‌ విషయంలో అన్యాయం చేస్తున్నాడు అంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.నేడు సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరుపుతున్నారు.త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబోతున్నారు.సెన్సార్‌ బోర్డు ముందుకు ఈ సినిమా వెళ్లబోతుంది.

తాజా వార్తలు

Bheesha Promotion Are Late-,bheeshma Latest Update,bheeshma Pree Release Event,nithin And Rashmikha Mandhana,nithin Bheeshma Related....