నులక మంచంపై పవన్ కళ్యాణ్.. అలసిపోయిన రానా ఫొటోస్ వైరల్?

Bheemla Nayak Shoot At Aluminium Factory

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి సినిమా భీమ్లా నాయక్.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటోంది.

 Bheemla Nayak Shoot At Aluminium Factory-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.ఈ క్రమంలోనే క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు.

ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, రానా అలసి పోవడంతో షూటింగ్ గ్యాప్ లో అలా సేద తీరారు.

 Bheemla Nayak Shoot At Aluminium Factory-నులక మంచంపై పవన్ కళ్యాణ్.. అలసిపోయిన రానా ఫొటోస్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ నులక మంచం పై, రానా ఎద్దుల బండి పై సేదతీరుతూ ఉన్నటువంటి ఫోటోలను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకేక్కిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరన జరుపుకుంటోంది.

Telugu Bheemla Nayak, Pawan Kalyan, Rana Daggupati, Tollywood-Movie

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటించగా రానా సరసన మలయాళ నటి సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ త్వరగా పూర్తి చేసుకుని ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావించారు.

#Rana Daggupati #Pawan Kalyan #Bheemla Nayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube