భీమ్లా నాయక్ నుంచి డానియల్ అప్డేట్.. రానా లుక్ మాములుగా లేదుగా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే “వకీల్ సాబ్” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Bheemla Nayak Movie Latest Update-TeluguStop.com

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి డానియల్ శేఖర్ గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం.

 Bheemla Nayak Movie Latest Update-భీమ్లా నాయక్ నుంచి డానియల్ అప్డేట్.. రానా లుక్ మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన పోస్టర్లు,గ్లింప్స్, టైటిల్ సాంగ్ విడుదల అవడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.అయితే ఇందులో రానా కూడా నటిస్తున్నారని, రానా కూడా పాన్ ఇండియా స్థాయి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, భీమ్లా నాయక్ సినిమాలో అతని పాత్రకు చాలా అన్యాయం జరుగుతోందంటూ రానా అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు భీమ్లా నాయక్ చిత్రం నుంచి డానియల్ శేఖర్ పాత్రకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ తీవ్ర నిరాశ చెందారు.ఈ క్రమంలోనే డానియల్ శేఖర్ పాత్ర అప్డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ పేరుతో ఈనెల 20వ తేదీన ఒక వీడియో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఒక పోస్టర్ విడుదల చేశారు.దీంతో తమ అభిమాన నటుడి పాత్రకు సంబంధించి అప్డేట్ రాబోతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.ఇకపోతే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించగా,రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

#Bheemla Nayak #Rana #Pawan Kalyan #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు