'ఎసెన్స్ ఆఫ్ భీమ్లా నాయక్'.. నాలుగవ పాటపై అఫిషియల్ అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Bheemla Nayak Fourth Single Is Adavi Thalli Maata Update, Bheemla Nayak Fourth S-TeluguStop.com

ముందు నుండే అంచనాలు ఉన్నా కూడా ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ ల కారణంగా మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇక మాటల మాంత్రికుడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తుండడంతో ఈ సినిమా మరొక రేంజ్ కు వెళ్ళిపోయింది.

ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుని మరి ఈ సినిమాను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుండే స్టార్ట్ చేసి వరుస అప్డేట్ లు ఇస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి నాలుగవ సింగిల్ ను విడుదల చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన మూడు పాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.ఇక ఇప్పుడు నాలగవ పాట రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు.

తాజాగా ఈ రోజు ఉదయం మేకర్స్ ఈ సినిమా నుండి వచ్చే నాలుగవ పాట గురించి ఒక అప్డేట్ ఇచ్చారు.”ఎసెన్స్ ఆఫ్ భీమ్లా నాయక్” అడవి తల్లి మాట అంటూ ఈ నాలుగవ పాట రేపు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.రేపు ఉదయం 10 గంటల 8 నిముషాలకు ఈ పాట రాబోతున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

ఇప్పటికే థమన్ అందించిన మూడు పాటలు రికార్డులు క్రియేట్ చేయగా ఇక ఈ పాట కూడా మరొక రికార్డ్ క్రియేట్ చేస్తుందని అభిమానులు అంత ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube