అరెస్ట్ అయిన విద్యార్ధులకి న్యాయసాయం.....భీంరెడ్డి  

అమెరికాలో వీసాల సమస్యలు తలెత్తడంతో తాజాగా అరెస్ట్ అయిన కొంతమంది తెలుగు విద్యార్ధుల విషయంలో అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు వారికి ఎటువంటి సాయం అవసరం అయినా సరే వెంటనే వారి వారి సేవలని అందిస్తున్నాయి. అయితే అరెస్ట్ అయిన తెలుగు విద్యార్ధుల కోసం “ఆటా” తప్పకుండా సాయం చేస్తుందని, వారి తల్లితండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రకటించిన ఆటా అధ్యక్షుడు భీంరెడ్డి

Bheem Reddy Helps To NRI Students-Nri Telugu Nri News Updates

Bheem Reddy Helps To NRI Students

తెలుగు విద్యార్ధుల కోసం తమ ఆటా తరుపున న్యాయసాయం అందిస్తున్నారు. అయితే వార్తలో వస్తున్నట్టుగా. ఆ వర్సిటీలో చదువుతున్న వారందరూ అరెస్ట్ అయ్యారనేది అవాస్తవమని, 50 -100 మాత్రమే అరెస్ట్ అయ్యారని భీంరెడ్డి తెలిపారు.

ఇదిలాఉంటే శాన్‌ఫ్రాన్సిస్కోలో అరెస్టుచేసిన సుమారు 14 మంది తెలుగు విద్యార్ధులని విడిచిపెట్టారు. వారు తిరిగి భారత్‌కు వెళ్లేందుకు అనుమతించారు. అయితే కొన్ని ప్రదేశాలలోని సెంటర్లలో ఉన్న తెలుగువారిని ఇంకా విడిచిపెట్టలేదు. వారిని జడ్జి ముందు ప్రవేసపెట్టిన తరువాత మాత్రమే వారి విదుదలపై నిర్ణయం తీసుకుంటారు.