ప్రవాస విద్యార్ధుల తల్లితండ్రులకి భీమ్‌రెడ్డి భరోసా...  

అమెరికాలో ఫేక్ యూనివర్సిటీ కారణంగా అక్కడ చదువుతున్న ఎంతో మంది విదేశీ విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ విదేశీయులలో ఎక్కువగా మంది తెలుగు విద్యార్ధులు సైతం ఉండటం గమనార్హం. అయితే ఈ విద్యార్ధుల అరెస్టులు ఉంటాయని వచ్చిన వార్తల నేపధ్యంలో ఎంతో మంది విద్యార్ధుల తల్లి తండ్రులు ఆందోళన కి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే..

Bheem Reddy About NRI People In America-Nri Telugu Nri News Updates

Bheem Reddy About NRI People In America

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న ఆ విద్యార్ధుల తల్లి తండ్రులకి ధైర్యం చెప్తున్నాయి. నకిలీ ధ్రువపత్రాలతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో తెలుగువారు అరెస్టయిన వార్తలు చూసి భారత్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్), నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం) విద్యార్ధులకి తోడుగా ఉంటామని తెలిపాయి.

Bheem Reddy About NRI People In America-Nri Telugu Nri News Updates

భారత్ నుంచీ ఎంతో మంది ప్రతీ ఏడాది లక్షలాది మంది వస్తుంటారని అయితే ఇక్కడి చట్టం ప్రకారం అన్ని పనులు సక్రమంగా సాగుతాయని ఆటా అసోసియేషన్‌ అధ్యక్షుడు పర్మేష్‌ భీంరెడ్డి అన్నారు. అమెరికా రావాలనుకునేవారు ఎలాంటి ఆందోళనలు అవసరం లేకుండా రావొచ్చని పేర్కొన్నారు. విద్యార్ధుల తల్లి తండ్రులు ధైర్యంగా ఉండాలని భీంరెడ్డి భరోసా ఇచ్చారు.