వందమందితో భీమ్ ఫైట్.. పీక్స్‌లో ఉంటుందట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Bheem Fight With Britishers To Give Goosebumps In Rrr, Bheem, Ntr, Rrr, Ram Char-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్లు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇక సినిమాలో తారక్ చేస్తున్న పాత్రకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో తారక్ పులితో చేసే ఫైట్ సీన్ అదిరిపోయే రేంజ్‌లో దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తోంది.కాగా ఈ సీన్‌తో పాటు మరో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.

అయితే తాజాగా మరో యాక్షన్ సీక్వెన్స్ గురించి సినీ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో కొమురం భీం చేసే ఫైట్ సీన్ పీక్స్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

బ్రిటిష్ సైనికులను ఏకంగా 100 మందిని ఒంటి చేత్తో మట్టికరిపించే కొమురం భీంగా తారక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ముగించారట చిత్ర యూనిట్.

కేవలం ఒకట్రెండు పాటలు మినహా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తిగా ముగిసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు.

దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి అటు సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube