మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన దేశంలో ఆలయాలు వివిధ కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో, కొలువై ఉన్నాయి.ఈ విధంగా ఆ ప్రదేశాలలో ఆలయాలు కొలువై ఉండటం వల్ల ప్రకృతి అందాలలో ఎంతో మనోహరంగా కనిపిస్తుంటాయి.
కానీ సముద్రంలో ఆలయం ఉండడం మీరు ఎప్పుడైనా విన్నారా?వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్న ఈ దేవాలయం చూడటానికి మరింత భయంకరంగా ఉంటుంది.సముద్ర గర్భంలో ఉండే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సముద్ర గర్భంలో ఉండే ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో, భావ్ నగర్ కు 23 కి.మీ దూరంలో అరేబియా సముద్ర తీరం వెంట కొలియాక్ గ్రామ సమీపంలో సముద్రం మధ్యలో ఉంది.ఈ ఆలయంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనం కల్పిస్తారు.
పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని దర్శించిన వారికి సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని చెబుతారు.అందువల్ల ఈ స్వామిని నిష్కలంక్ మహాదేవ్ అని కూడా పిలుస్తారు.
అయితే ఈ సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఉదయం ఈ ఆలయాన్ని చూడటానికి వీలు ఉండదు.ఉదయం సముద్రంలో పెద్ద ఎత్తున అలలు రావడంతో ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది.ప్రతిరోజు పది గంటల సమయంలో సముద్రంలో అలల క్రమంగా తగ్గుతూ ఉండటం వల్ల జెండాతో ఉన్నటువంటి ఒక స్తూపం ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి.అప్పుడు ఈ ఆలయానికి భక్తులు చేరుకొని పూజలను నిర్వహిస్తారు.
అమావాస్య, పౌర్ణమి, మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
మన కుటుంబంలో ఎవరైనా పెద్ద వాళ్ళు మరణిస్తే వారి అస్తికలు ఈ సముద్ర గర్భంలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పెద్ద ఎత్తున భక్తులు విశ్వసిస్తారు.
మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడికి పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు.మధ్యాహ్న సమయంలో సముద్రం కొంతభాగం వెనక్కి వెళ్లడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు.
అయితే సైన్స్ కి అంతుచిక్కని విషయం ఏమిటంటే ఈ ఆలయం సముద్ర గర్భంలో ఏ విధంగా కట్టారనే రహస్యం ఇంతవరకు సైన్స్ కి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
DEVOTIONAL