ఏపీకి ప్రత్యేక హోదాపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల విషయంలో ఏపీ ప్రత్యేక హోదా అతి కీలకమని అందరికీ తెలుసు.

ఏపీ ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వం టీడీపీ( TDP party ) ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP party ) కేంద్రాన్ని గట్టిగా ఎక్కడ కూడా నిలదీయలేదు.

ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేస్తున్న సమయంలో పార్లమెంట్ సాక్షిగా పది సంవత్సరాలు పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వెల్లడించింది.కానీ ఈ హామీ ఎక్కడా కూడా అమలు కాలేదు.

ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ పార్టీలు వాడుకున్నాయి.

ఇటువంటి క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క( Bhatti Vikramarka )ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని అన్నారు.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధానమంత్రి అవటం తధ్యమని పేర్కొన్నారు.

Advertisement

తెలంగాణలో చేపట్టిన పీపుల్స్ మార్చ్  పాదయాత్ర విజయవంతం కావడంతో ప్రత్యేక బస్సులో భట్టి విక్రమార్క తిరుమలకు బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు