తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగిన బట్టి విక్రమార్క.. ?

ఈ రోజు తెలంగాణ శాస‌న‌స‌భ‌లో వార్షిక బ‌డ్జెట్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ బడ్జెట్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Bhatti Vikramarka Comments On Telangana Budget, Batti Vikramarka, Comments, Tela-TeluguStop.com

ఈ నేపధ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గన్ పార్క్ వద్ద మీడియాతో, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం అంకెల పుస్తకంలా ఉంది తప్ప దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని నిప్పులు చెరిగారు.

తెలంగాణలో కరోనా వల్ల ఆదాయం దెబ్బతిన్నదని చెబుతున్న కేసీయార్ 2లక్షల 30 వేల 825 కోట్ల రూపాయలతో తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఎలా సాధ్యమో వివరించాలని ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే మూడున్నర లక్షల కోట్ల అప్పు తెవ్లంగాణ రాష్ట్రంపై ఉందని, తాజాగా ఇప్పుడు తెచ్చే ఒటిన్నర లక్షల కోట్ల అప్పుతో కలసి అది రూ 5 లక్షల కోట్లకు చేరుతుందని, తెలంగాణ అభివృద్ధిని పక్కనపెడితే ఈ అప్పుల వల్ల ఎవరు బాగుపడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.

అదీగాక భారీగా తీసుకువచ్చిన అప్పులతో సామాన్యులకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమం చేయలేదని ఈ సందర్భంగా భట్టి గుర్తుచేశారు.ఇక ప్రజలను మభ్యపెట్టడంలో ఈ ప్రభుత్వం పీహెచ్‌డి చేసిందని, వాస్తవాలకు దూరంగా ఉన్న బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మాయ చేస్తుందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube