పెళ్లి చేసుకున్న భార్యని 11 ముక్కలు చేశాడు..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు       2018-04-18   23:18:05  IST  Raghu V

గుజరాత్ లో ఇటీవల ఒక బాలిక పై జరిగిన హత్యచార ఘటన మరువక ముందే మరో ఘటన గుజరాత్ ని షేక్ చేసింది కట్టుకున్న భార్యని ఓ ముక్కలు ముక్కలుగా చేసి ఓ కాలువలో పడేస్తూఉండగా నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు పోలీసులు వివరాలలోకి వెళ్తే..

-


గుజరాత్ లోని సూరత్ పట్టణంలో షానవాజ్ యూసుఫ్ మియా షేక్ రాణి కలిసి సరుకు రవాణా దుకాణాన్ని నడుపుతున్నారు..అయితే అక్కడ తన భార్య జోహా తోనే నివాసం కూడ ఆన్తున్నాడు అయితే అమ్రావతికి చెందిన జులేఖతో ప్రేమాయణం సాగించాడు.దీంతో ఆమెను రెండో పెళ్ళి చేసుకొన్నాడు. దీంతో ఇద్దరి భార్యలతో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు చోటు చేసుకొన్నాయి. ఈ కారణంగానే ఆయన రెండో భార్యను చంపేశాడు. .

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యను వివాహం చేసుకున్న షానవాజ్..తన ఇద్దరు భార్యలని ఒకే ఇంట్లో ఉంచాడు మొదటి భార్య జోహ్రాబ్ నబీకి, జులేఖకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవలతో షానవాజ్ భరించలేకపోయాడు. ప్రశాంతత లేకుండా పోయిందని భావించాడు రెండో భార్య జులేఖను అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు..

ఈ క్రమంలో షానవాజ్ ఆదివారం నాడు రాత్రి ఆమెను చంపేసి శరీరాన్ని 11 ముక్కలుగా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా భతేనాఖడీలోని ఉద్నా కాలువలో పడేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు..అయితే షానవాజ్ మొదటి భార్య ఆమె సోదరి ఆరోజు రాత్రి నుంచీ కనిపించకుండా పోయారు అయితే ఈ హత్యలో వారికి కూడా సంభంధం ఉండనే అనుమానాలు కూడా కలుగాడంతో పోలీసులు కేసుని ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.