భార్యలు భర్తను మోసం చేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా.? వేధించడం కాదంట.!       2018-06-30   23:23:13  IST  Raghu V

ఒక వ్య‌క్తి మ‌న‌ల్ని మోసం చేస్తున్నాడా ? లేదంటే అత‌ను నిజ‌మే చెబుతున్నాడా ? అనే విష‌యాల‌ను ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ తెలుసుకోలేరు. అలా తెలుసుకోవాలంటే స్వ‌యంగా ఆ వ్య‌క్తే నేను నిన్ను మోసం చేస్తున్నా ! అని చెప్పాలి. లేదంటే అత‌ను ఆ విష‌యం వేరే ఎవ‌రికైనా చెబితే తప్ప వారి ద్వారా మ‌న‌కు అది తెలియ‌దు. ఇది ఇలా ఉంటె భార్యాభర్తల మధ్య తగాదాలు సర్వసాధారణం. కానీ ఒకోసారి విడాకులకు దారి తీస్తుంటాయి.

భార్య భర్తను మోసం చేయడం. భర్త భార్యను మోసం చేయడం అనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వింటూనే ఉన్నాము. మోసం చేసి అక్రమ సంబంధం పెట్టుకొని నీచమైన ఘటనలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే భార్యలు భర్తను మోసం చేయడానికి గల కారణాలు ఏంటో ఓ సారి చూడండి. దీనికి కారణం భర్తలు వేదించడమో బాధించడమో కాదు, ఇంట్లో రోజువారీ పనుల్లో హెల్ప్ చెయ్యని కారణంగానే ఎక్కువ మంది భార్యలు తమ భర్తలను మోసం చేస్తున్నారని ఫ్రాన్స్ సర్వేలో వెల్లడయింది.

చాలా మంది ఈ పరిస్థితి గొడవకు సైతం దారితీస్తున్నట్టు చెప్పారు. ఇంటి పనుల్లో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే దంపతులు సెక్స్ లో కూడా మరింత ఎక్కువ సమయం చురుగ్గా పాల్గొంటున్నారని మరో సర్వేలో తెలిసింది. ఏదేమైనా భార్య భర్తలు అంటే..కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుంటే బంధం బలంగా ఉంటుంది.