భరత్ అనే నేను మూవీ రివ్యూ

చిత్రం : భరత్ అనేేేే నేేేనున
బ్యానర్ : DVV
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాతలు : దానయ్య
సంగీతం : దేవిశ్రీప్రసాద్
విడుదల తేది : ఏప్రిల్ 20, 2018
నటీనటులు : మహేష్ బాబు, కియారా అద్వానీ తదితరులు

 Bharth Ane Nenu Movie Review-TeluguStop.com

కథలోకి వెళితే :
ఆక్ఫర్డ్ యూనివర్సిటీ లో చదవుకుంటున్న భరత్ రామ్ (మహేష్ బాబు) తన కుటుంబంలో జరిగిన ఓ దుర్ఘటన వలన ఇండియా తిరిగి వస్తాడు‌.అయితే ఊహించని విధంగా వరద (ప్రకాష్ రాజ్) మాట మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తాడు భరత్.

కుర్చీ ఎక్కిందే తడవుగా సోషల్ రిఫార్మర్ అవతారం ఎత్తుతాడు భరత్.దాంతో రాజకీయ శతృవులు పుట్టుకొస్తారు.

ఓ దశలో భరత్ అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి.మరి భరత్ ఈ ఆటుపోట్లు ఎలా ఎదర్కున్నాడు? తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా అనేది మిగితా కథ.

నటీనటులు నటన :

మహేష్ బాబు గత రెండు మూడు చిత్రాలు గమనిస్తే మెల్లోగా మాట్లాడటం, సబ్టిల్ గా పెర్ఫర్మ్ చేయడం అనేది స్పష్టంగా కనిపించే విషయం ‌.మహేష్ ఏంటి ఇలా మొనాటోనస్ గా అయిపోతున్నాడు అనే విమర్శలు కూడా వచ్చాయి.అన్నిటికి సమాధానం చెప్పేసాడు.ఒకటి రెండు సన్నివేశాలు అని కాకుండా, సినిమా మొత్తం తన పునర్వైభవాన్ని చూపించాడు.అసెంబ్లీ సన్నివేశం, దర్గామహల్ ఒక ఎత్తైతే, ప్రెస్ మీట్ మహేష్ లోని ఇంటెన్సిటి ఏంటో చూపిస్తుంది.కాస్త నాటుగా చెప్పాలంటే, సూపర్ స్టార్ చింపేసాడు.

కియారా అందంగా ఉంది.డిసెంట్ గా అభినయించింది.ప్రకాష్ రాజ్ షరామాములే‌.రవిశంకర్ గుర్తుంచుకోదగ్గ పాత్రలో కనిపించారు.

దేవిశ్రీప్రసాద్ అల్బమ్ లో మూడు పాటలు మంచి ప్రజాదారణ పొందాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొరటాల రాసుకున్న సన్నివేశాలకి న్యాయం చేసాడు దేవి.భరత్ ప్రమాణస్వీకారం తీసుకున్న తరువాత వచ్చే స్కోర్ హైలేట్‌.సినిమాటోగ్రఫీ అదుర్స్.

‌బడ్జెట్ కి పూర్తి న్యాయం జరిగింది‌.ఎడిటింగ్ ఫస్టాప్ కొద్దిగా షార్ప్ గా ఉండాల్సింది.

విశ్లేషణ :

కథ కొత్తదేమి కాదు.రెండు నిమిషాల్లో సినిమా ఏంటో చెప్పొచ్చు.

కాని కథనం మాత్రం కొరటాల మార్క్ తో ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉంటుంది.మహేష్ ను సియ్యం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఇలా సియ్యం అయ్యాడో లేదో అసెంబ్లీ సీన్ తో గడగడలాడిస్తాడు.ఇక మొదలు, మాస్ కి కావాల్సిన ఎలివేషన్ సీన్లు వడ్డిస్తూ, క్లయిమాక్స్ దాకా ఆ జడివాన ఆపలేదు.

ఈ సినిమాలో నెగెటివ్ ఏమైనా ఉందంటే, మహేష్ సియ్యం కూర్చి కోల్పోయే సీన్ ఇంకొంచెం కన్విన్సింగ్ ఉండాల్సింది.అలాగే పీక్ టైమ్ లో డ్యుయెట్ సాంగ్ మరో మైనస్‌.

ఇక ఒవరాల్ గా మాట్లాడుకుంటే, కమర్షియల్ పంథాలో అర్థవంతమైన సినిమా ఇది‌.ఇటు మాస్ ని, అటు క్లాస్ ని మెప్పించే సినిమా.ఆలోచింపజేసే సినిమా, అలరించే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

* మహేష్ బాబు – కొరటాల

* అసెంబ్లీ, ప్రెస్ మీట్, థియేటర్ సీన్స్

* సెకండాఫ్

మైనస్ పాయింట్స్ :

* కొద్దిగా స్లో నరేషన్

* లవ్ ట్రాక్

చివరగా :

బాబు ఈజ్ బ్యాక్

రేటింగ్ : 3.25/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube