ఆండ్రాయిడ్‌కి పోటీగా BharOS… ప్రత్యేకతలు ఇవే!

మొబైల్ OS (ఆపరేటింగ్ సిస్టమ్) విభాగంలో అండ్రాయిడ్ అండ్ IOS ఆపరేటింగ్ సిస్టమ్‌లు చాలా కాలంగా ప్రపంచాన్ని శాసిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే.ఆపిల్ మినహా దాదాపు అన్ని ఇతర స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి.

 ఆండ్రాయిడ్‌కి పోటీగా Bharos… ప్-TeluguStop.com

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్‌లు చలామణిలో ఉన్నాయని ఎంతమందికి ఇక్కడ తెలుసు? వీటికి ఆండ్రాయిడ్‌ని సవాలు చేసే సామర్ధ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు.అటువంటి స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు BharOS.

Telugu Android, Bharos, Latest, Ups-Latest News - Telugu

ఇది భారతదేశంలోని 100 కోట్ల మొబైల్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని అంరున్నారు. BharOSని ‘భరోసా’ అని కూడా పిలుస్తారు, ఇది ఒక భారతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్.ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను IIT మద్రాస్ ఇంక్యుబేటెడ్ సంస్థ డెవలప్ చేసింది.ఈ సాఫ్ట్‌వేర్ కమర్షియల్ ఆఫ్-ది-షెల్ఫ్ హ్యాండ్‌సెట్‌లలో ఇన్‌స్టాల్ చేయవచ్చు.ఈ OS ప్రత్యేకత ఏమిటంటే? ఇది హైటెక్ సెక్యూరిటిని కలిగి ఉండి గోప్యతతో వస్తుంది.అంటే, ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యూజర్లు అవసరాలకు అనుగుణంగా యాప్‌లను సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా ఉపయోగించడానికి ఎక్కువ ఫ్రీడం, కంట్రోల్, సౌలభ్యాన్ని పొందుతారు.

Telugu Android, Bharos, Latest, Ups-Latest News - Telugu

స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ BharOS సర్వీసెస్ సెక్యూరిటి ఇంకా ప్రైవసీ అవసరం ఉన్న సంస్థలకు మాత్రమే ప్రస్తుతం అందించబడుతున్నాయి.అలాంటి యూజర్లకు ప్రైవేట్ 5G నెట్‌వర్క్ ద్వారా ప్రైవేట్ క్లౌడ్ సర్వీస్ కు యాక్సెస్ అవసరం.ఈ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్రాయిడ్ కంటే నమ్మదగినదిగా చెప్పుకొస్తున్నారు.IIT మద్రాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన JNDK ఆపరేషన్స్ Pvt ఈ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసింది.

అంతేకాకుండా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు వారి డివైజెస్ లో ఉన్న యాప్‌లపై మరింత కంట్రోల్ ఇస్తుంది.దాంతో భయపడాల్సిన అవసరమే లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube