రిలీజ్ కి ముందు వివాదంలోకి సీత! పేరు మార్చకపోతే ఇక అంతే  

సీత మూవీ టైటిల్ మార్చాలి అంటున్న భారతీయ యువ మోర్చ. .

Bharatiya Yuva Morcha Fire On Seetha Movie Title-bharatiya Yuva Morcha,director Teja,fire On Seetha Movie Title,kajal,telugu Cinema,tollywood

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీత. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి అంచనాలు అందుకుంది. ఇందులో కాజల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో మోడరన్ సీతగా కనిపిస్తుంది..

రిలీజ్ కి ముందు వివాదంలోకి సీత! పేరు మార్చకపోతే ఇక అంతే -Bharatiya Yuva Morcha Fire On Seetha Movie Title

ఇక ఆమెని వెన్నంటే కాపాడే హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా చుట్టూ వివాదం రాజుకుంది.ఇక ఈ వివాదానికి కారణంగా సినిమాకి సీత టైటిల్ పెట్టడం, దానికి తోడు సీత పాత్రని నెగిటివ్ షేడ్స్ లో ప్రాజెక్ట్ చేయడమే అని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాపై భారతీయ యువ మోర్చా వివాదం రాజేసింది.

సీత టైటిల్ పాత్ర హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణం సినిమా టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టైటిల్ మార్చకుండా సినిమా రిలీజ్ చేస్తే దియేటర్స్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే రిలీజ్ కి ముందు ఇలా సినిమాపై ఉన్నపళంగా వివాదం రాజేయడం వెనుక ప్రమోషన్ స్ట్రాటజీ ఉంది అనే టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.