కమలహాసన్ కూతురు శృతిహాసన్ పై బీజేపీ ఫిర్యాదు..!! 

దాదాపు రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు నిన్న తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో దాదాపు 63.47% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా తన ఇద్దరు కూతుళ్లతో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.

 Bjp Complaint Against Kamal Haasan Daughter Shruthi Haasan , Tamilnadu, Kamal Ha-TeluguStop.com

అనంతరం కమలహాసన్ తాను పోటీ చేస్తున్నా కోయంబత్తుర్ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల సరళి ఏర్పాట్లు అన్నిటినీ పరిశీలించడం జరిగింది.

ఈ క్రమంలో కమల్ తనతోపాటు శృతిహాసన్ ని కూడా తీసుకెళ్లడం జరిగింది.

దీంతో భారతీయ జనతా పార్టీ నిబంధనలకు విరుద్ధం పోలింగ్ బూత్ లోకి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ రావటం జరిగిందని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.అక్రమంగా ఆమె పోలింగ్ బూత్ లోకి రావటం జరిగిందని దీంతో శృతిహాసన్ పై క్రిమినల్ యాక్షన్ చర్యలు తీసుకోవాలంటూ బిజెపి డిమాండ్ చేస్తూ ఉంది.

ఈ సందర్భంగా దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారి కి లెటర్ రాయడం జరిగింది.పోలింగ్ కేంద్రాల్లో కి బూతు ఏజెంట్లు తప్ప మరొకరు రాకూడదు అనే నిబంధనను శృతిహాసన్ అతిక్రమించి ఉందని ఆమెపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube