ప్రణబ్ ముఖర్జీ ని వరించిన భారతరత్న అవార్డు !

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించారు.అలాగే నానాజీ దేశ్ ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించారు.

 Bharatha Ratna Award Coming To Deshmukh Hazarika Pranab Mukherjee-TeluguStop.com

ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు.ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు.1935 డిసెంబర్‌ 11న జన్మించిన ప్రణబ్‌ ముఖర్జీ కీదిస్తాయి నుంచి ఎదిగారు.2004 నుంచి 2006 వరకు రక్షణమంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా, 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు.

భూపేన్‌ హజారికా ప్రముఖ సంగీత విద్వాంసుడు.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డులు సొంతం చేసుకున్నారు.కవి, సంగీత కూర్పరి, నటుడు, గాయకుడు, జర్నలిస్ట్, రచయిత, చిత్ర దర్శకుడిగా హజారికా ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు పని చేశారు.సంగీత నాటక అకాడమీ రత్న అవార్డు, అస్సాం రత్న అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

సెప్టెంబరు 8, 1926లో అస్సాంలోని సాదియాలో జన్మించిన హజారికా 5 నవంబరు 2011లో కన్నుమూశారు.జనసంఘ్‌ నేత నానాజీ దేశ్‌ముఖ్‌ 1999-2005 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

ఆయనకు 1999లో కేంద్రం పద్మ విభూషణ్‌ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube