వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన ఆ యువ ఎంపీ.. కార‌ణం ఇదే...

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాల్సిందే.కానీ, ఆ దూకుడు త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా.

 This Ysrcp Mp Turns Hot Topic In Andhra Politics  Andhra Pradesh, Chief Minister-TeluguStop.com

పార్టీ అధిష్టానానికి అఫ‌ఖ్యాతి తెచ్చేలా ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉండ‌కూడ‌ద‌ని అంటారు ప‌రిశీల‌కులు.చాలా మంది నాయ‌కులు దూకుడుగానే ఉన్నా.

వివాదాల‌కు దూరంగా ఉంటారు.కానీ, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ విష‌యంలో దూకుడు బాగున్నా.

ఆయ‌న వ్యూహాలు బాగున్నా.మాట‌తీరు మెచ్చుకునేలా ఉన్నా.

పార్టీని, ఆయ‌న‌ను ప్ర‌తిప‌క్షాల‌కు, పార్టీ వ్య‌తిరేక మీడియాకు నేరుగా అప్ప‌గించి అక్షింత‌లు వేయించుకునేలా ఉన్నాయ‌ని పార్టీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.

పార్టీలో యువ నేత‌గా వ‌చ్చిన మార్గాని.రాజ‌మండ్రి ఎంపీ స్తానం నుంచి విజ‌యం సాధించారు.

దూకుడుగా రాజ‌కీయాలు చేస్తున్నారు.ఇంత వ‌ర‌కుబాగానే ఉన్న‌ప్ప‌టికీ.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌ల‌తో దూరంగా ఉండ‌డం వివాదంగా మారింది.దీనిని తీర్చలేక అధిష్టానం కూడా ఇబ్బంది ప‌డింది.

ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో పార్టీలైన్‌కు అనుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.మూడు రాజ‌ధానులు ఉంటేనే ఏపీ అభివృద్ధి అని నొక్కి చెబుతున్నారు.

ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.తాజాగా ఆయ‌న చేసిన పోస్టింగ్ వివాదానికి కార‌ణ‌మైంది.

వ్యక్తిగ‌తంగా భ‌ర‌త్‌కు, పార్టీకి కూడా ఇబ్బంది వ‌చ్చింది.తాజాగా కురిసిన వ‌ర్షాల‌తో రాజ‌ధాని అమ‌రావ‌తి మునిగిపోయింద‌ని వైసీపీ నేత‌లు కొంద‌రు ప్ర‌చారం చేశారు.వీరి జాబితాలో చేరిపోయిన ఎంపీ. ‘‘దీనినేనా మార్చొద్దు అంటున్నది! అన్నీ ఇక్కడే ఉండాలా? గట్టిగా వర్షం వస్తే రాష్ట్ర రాజధాని అని చెప్పుకోవడానికి పేరు  కూడా ఉండదు’ అని ఓ ఫొటోను పెట్టి కామెంట్ చేశారు.అయితే, ఇది తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది.

దీనిపై రంగంలోకి దిగిన టీడీపీ సోష‌ల్ మీడియా వ‌ర్గాలు.

ఎంపీ భ‌ర‌త్‌ పోస్ట్‌ చేసిన ఫొటో ఏడాది కిందటిద‌ని, వరదలో మునిగిన ఊరు ఫొటో కూడా గోదావరి జిల్లాల్లో వచ్చిన వరద చిత్రం అని వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభించారు.ఇది వ్య‌క్తిగ‌తంగా భ‌ర‌త్‌కు , వైసీపీకి కూడా ఇబ్బందిగా మార‌డం గ‌మ‌నార్హం.

మ‌రి దీనిని గ‌మ‌నిస్తున్న వైసీపీ సీనియ‌ర్లు.దూకుడు ఉండాలి.కానీ, వివాదాల్లో చిక్కుకోకుండా కూడా వ్య‌వ‌హ‌రించాలి క‌దా?? అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube