ఏపీ లో మొదలు కానున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. మొదట అక్కడే...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి లక్షల సంఖ్యలో బాధపడుతుండగా వేల సంఖ్యలో మృతి చెందారు.

 Bharath Bio Tech Company, Clinical Trials, Vsakhapatnam, Corona Virus-TeluguStop.com

దీంతో దేశ ప్రజలు కరోనా వైరస్ ని అంతం చేసేటువంటి వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా…  అంటూ కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ విషయం గురించి స్పందించిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది.

ఇందులో భాగంగా కరోనా వైరస్ ని అంతమొందించేందుకు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ మెల్లమెల్లగా విజయవంతమవుతుందని పేర్కొంది.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఈ కరోనా వ్యాక్సిన్  క్లినికల్  ట్రయల్స్  చేసేందుకు అనుమతులు కూడా జారీ చేశారు.

దీంతో ఈ విషయం కొంతమేర రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగిస్తోంది.ఒకవేళ ఆ ఇ ఈ  కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా విజయవంతమైతే ఆగస్టు నెలలో  వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

అయితే దేశ వ్యాప్తంగా ఈ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు విశాఖపట్నం తో పాటు మరో 11 నగరాలను కూడా ఎంపిక చేశారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ గణాంకాలను ఒకసారి పరిశీలించినట్లయితే  ఇప్పటి వరకూ 625,544 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 18 వేల పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు.

మరో 3 లక్షల 79 వేల మంది విజయవంతంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube