ఎట్టకేలకు పట్టాలు ఎక్కుతున్న భారతీయుడు సీక్వెల్ ఎక్స్ ప్రెస్  

Bharateeyudu Movie Sequel Ready To Came On Track Soon -

కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందే భారతీయుడు 2 చిత్రం ఎప్పుడో ప్రారంభం అయ్యింది.మొద‌టి షెడ్యూలు కొంత అయ్యాక సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది.

Bharateeyudu Movie Sequel Ready To Came On Track Soon

ఇందులో సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఒక కీలక పాత్ర చేస్తుంది.అలాగే సిద్దార్ద్ కూడా నటిస్తున్నాడు.

ఇక భారీ బడ్జెట్ లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చింది.అయితే ఈ సినిమా ఊహించని విధంగా ఆగిపోవడానికి కారణం శంక‌ర్ తీసిన సినిమాలు అన్నీ వరుసగా విఫలం కావడమే.

చివరికి రోబో సీక్వెల్ గా వచ్చిన 2.ఓ కూడా కలెక్షన్స్ వచ్చిన అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది అనే విమర్శ ఉంది.

ఈ నేపధ్యంలో భారతీయుడు సీక్వెల్ ఇకా ఆగిపోయినట్లే అని టాక్ వచ్చింది.శంకర్ వేరొక సినిమా చేసుకుంటున్నాడని, తమిళంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకి కథ సిద్ధం చేసుకుంటున్నాడు అని టాక్ బలంగా వినిపించింది.

దర్శకుడు శంకర్ కి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారికి బడ్జెట్టు విషయంలో అభిప్రాయభేదాలు వచ్చి ఆగిపోయిందని చెప్పుకున్నారు.అయితే కొద్ది రోజుల క్రితం వీరు కూర్చుని మాట్లాడుకున్నారని, పరిమితమైన బడ్జెట్టులో పూర్తి చేయడానికి దర్శకుడు అంగీకరించడంతో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు అని టాక్ వినిపిస్తుంది.

అధికారికంగా ఈ విషయాన్ని ద్రువీకరించే అవకాశం ఉందని సమాచారం.ఆగస్టు నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందని తాజా మొదలవుతుంది అని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు