అట్టర్‌ఫ్లాప్ స్ట్రాటెజీని వాడుతున్న భారతీయుడు

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్-2’ చిత్రం ఖచ్చితంగా ఒకటిగా ఉంటుంది.గతంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్(తెలుగులో భారతీయుడు) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

 Bharateeyudu 2 To Use Failure Strategy, Bharateeyudu 2, Shankar, Kamal Hassan, N-TeluguStop.com

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ సినిమాతో ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు.ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అప్పట్లో ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్-2 చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన శంకర్, శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఈ సినిమా కోసం శంకర్ ఓ అట్టర్ ఫ్లాప్ మూవీ స్ట్రాటెజీని వాడబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే టైటిల్స్‌తో ఈ బయోపిక్ చిత్రాన్ని రిలీజ్ చేశారు.అయితే ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన కొడుకు తెరకెక్కించడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ భావించారు.

కానీ సినిమాలో పెద్దగా ఆకట్టునే అంశాలు లేకపోవడంతో ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.ఎన్టీఆర్ క్రేజ్‌ను ఇలా రెండు భాగాలుగా క్యాష్ చేసుకోవాలని చూసిన చిత్ర యూనిట్‌కు భంగపాటు తప్పలేదు.

ఇప్పుడు ఇదే తరహాలో భారతీయుడు-2 చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.మంచి కాన్సెప్ట్ ఉన్న కథ కావడంతో ప్రేక్షకులు ఎలాగైనా చూస్తారనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారట చిత్ర యూనిట్.

ఇక భారీతీయుడు-2 చిత్రంతో అదిరిపోయే లాభాలు గడించాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.మరి వారి ఆశలను ప్రేక్షకులు ఎంతమేర నెరవేరుస్తారు, అసలు ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతుందా అనే సందేహం సర్వత్రా నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube