బాలుకు భారతరత్న కోసం పీఎంకు జగన్‌ విజ్ఞప్తి

గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం కన్ను మూసిన నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురి అవుతున్నారు.ఆయన లేని లోటు మరెవ్వరు తీర్చలేరు.ఇండియాలోనే అలాంటి గాయకుడు లేడు అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.దేశం గర్వించదగ్గ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే మీడియాలో కొందరు క్యాంపెయిన్ ప్రారంభించారు.ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయాన్ని తీసుకెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Cm Jagan Writes Letter To Pm Modi For Bharat Ratna To Sp Bala Subramanyam , Cm J-TeluguStop.com

ఈ సమయంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి భారతరత్న ఇవ్వాలంటూ లేఖ రాశారు.అందులో బాలసుబ్రహ్మణ్యం సాధించిన విజయాలను మరియు ఆయన సాధ్యమైన గొప్ప కార్యాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత మరెవ్వరికీ సాధ్యం కాదని అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ ప్రధాని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తమ వంతుగా నెల్లూరు జిల్లాలో బాలు జ్ఞాపకార్థం స్మారక ఏర్పాటు చేయబోతున్నట్లు గా పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ట్యాంక్‌ బండ్‌ పై విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కరోనాతో బాధపడుతూ గత నెల ఐదో తారీకు న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం రెండు రోజుల క్రితం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఆయన మృతి వార్త సినీ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆయనకు భారతరత్న ఇస్తే అభిమానులు కాస్త అయినా ఉపశమనం పొందవచ్చు.అంతర్జాతీయ మీడియాలో బాలు గారి గురించి వచ్చిన కథనాలకు మంచి స్పందన లభించిందట.

ఆయన సాధించిన ఖ్యాతి ప్రపంచంలో మరెవ్వరు పొందలేదని కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.కనుక ఆయన భారతరత్నకు అర్హుడు అంటూ అభిమానులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube