రీల్ హీరోలకు కాదు.. రియల్ హీరోకు భారతరత్న ఇవ్వాలి!  

Bharat Ratna For Sonu Sood Goes Trending, Sonu Sood, Migrant Workers, Bharat Ratna, Twitter, Bollywood News - Telugu Bharat Ratna, Bollywood News, Migrant Workers, Sonu Sood, Twitter

సినిమాల్లో హీరోలుగా ఒక స్థాయికి చేరుకున్నవారు కూడా చేయలేని పనిని కొంతమంది ఎవ్వరికీ తెలియకుండా చేస్తుంటారు.కాగా కొంతమంది మాత్రం తాము చేసే మంచిపని వల్ల ఇతరులు కూడా తమవంతు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతుంటారు.

 Bharat Ratna For Sonu Sood Goes Trending

ఇదే జాబితాలో ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా ఉన్నారు.తెలుగులో పలు విలన్ పాత్రల్లో నటించిన సోనూ సూద్, నిజజీవితంలో మాత్రం హీరోగా మిగిలాడు.

కరోనా వైరస్ కారణంగా వలస కార్మికుల బాధలను చూసిన ఆయన చలించిపోయారు.దీంతో ఆయన తన సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి వసల కార్మికులను తమ సొంతూళ్లకు వెళ్లేందుకు తనవంతు సాయం చేశాడు.

రీల్ హీరోలకు కాదు.. రియల్ హీరోకు భారతరత్న ఇవ్వాలి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ విషయం మరవక ముందే, తాజాగా కేరళలోని ఎర్నాకుళంలో ఓ కుట్టుమిషన్ల కంపెనీలో 177 మంది మహిళా కార్మికులు తమ సొంత రాష్ట్రం ఒడిషాకు వెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా సోనూసూద్‌ను కోరడంతో ఆయన ఓ విమానం ఏర్పాటు చేసి వారిని తమ సొంతూళ్లకు పంపించాడు.

సోనూ సూద్ చేసిన ఈ నిస్వార్ధ సాయం గురించి ప్రస్తుతం యావత్ భారతదేశం చర్చించుకుంటోంది.

రీల్ హీరోలకంటే రియల్ హీరోగా మారిన సోనూ సూద్ ఎంతో బెటర్ అని, అందరూ ఆయన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని పలువురు అంటున్నారు.ఇలాంటి వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

ఈ క్రమంలో #BharatRatnaForSonuSood అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bharat Ratna For Sonu Sood Goes Trending Related Telugu News,Photos/Pics,Images..