మళ్లీ మొదలు కాబోతున్న ‘భారత్ దర్శన్’ …!  

bharat darshan to start again,Train tickets, bharathi tour, IRCTC, tour, covid 19 - Telugu Bharathi Tour, Covid-19, Irctc, Tour, Train Tickets

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ట్రైన్స్ అన్ని కూడా రద్దు అయిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ లాక్మార్గదర్శకాల అనుగుణంగా కొన్ని రైళ్లు మళ్ళీ తిరిగి ప్రారంభించేందుకు ఐఆర్సిటిసి సిద్ధమవుతోంది.

TeluguStop.com - Bharat Darshan To Start Again

ఇందులోభాగంగానే డిసెంబర్ నెలలో దక్షిణ భారత దేశంలో ఆరు రోజులపాటు యాత్రలు నిర్వహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ అధికారులు ఏర్పాటు చేయడం ప్రారంభించారు.

దక్షిణ భారత యాత్ర డిసెంబర్ 12 నుంచి భారత్ దర్శన్ రైలు ప్రారంభం అవ్వబోతుంది.

TeluguStop.com - మళ్లీ మొదలు కాబోతున్న భారత్ దర్శన్’ …-General-Telugu-Telugu Tollywood Photo Image

భారత్ దర్శన్ రైల్ లో స్లీపర్ లో 12 బోగీలు, ఏసీ త్రీ టైర్ 1, పాంట్రీ కార్ 1 బోగి లలో కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.ఇక దక్షిణ భారత యాత్ర పర్యటన చేయాలని ఆసక్తి గల అభ్యర్థులు ఐఆర్సిటిసి తెలిపిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చని ఐఆర్సిటిసి జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య ఈ సందర్భంగా తెలియజేశారు.

ఆసక్తి కల పర్యాటకులు బుకింగ్ కోసం ఐఆర్సిటిసి జోనల్ కార్యాలయం సికింద్రాబాద్ 040-27702407, 9701360701, 8287932227 నెంబర్లకు ఫోన్ చేసి సులువుగా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇక దక్షిణ భారత యాత్ర కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ ఫోన్ నెంబర్ల ద్వారానే తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.ఇక ప్యాకేజ్ ధర విషయానికి వస్తే స్లీపర్ క్లాస్ లో ప్రయాణం చేయాలనుకునేవారికి ఒక్కొక్కరికి రూ.7,140 గా నిర్ణయించారు.ఏసీ త్రీ టైర్ క్లాస్ లో ప్రయాణం చేయాలనుకునేవారికి ఒక్కొక్కరికి రూ.8,610 గా నిర్ణయించారు.ఈ దక్షిణ భారత యాత్రకు వెళ్లాలని అనుకునేవారు వెంటనే అధికారులు తెలిపిన ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సులువుగా బుక్ చేసుకోవచ్చు.

#Tour #Train Tickets #Bharathi Tour #Irctc #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bharat Darshan To Start Again Related Telugu News,Photos/Pics,Images..