కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వారికి భారత్ బయోటెక్ గుడ్ న్యూస్.. !

దాదాపు పన్నెండు నెలలుగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి విముక్తి ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్న దేశప్రజల ఆశలను నెరవేరుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ నేడు అన్ని రాష్ట్రాల్లో విజయవంతగా ముందుకు సాగుతుంది.

 Bharat Biotech, Good News, Side Effects, Covaxin Vaccine-TeluguStop.com

అక్కడక్కడ ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ వికటిస్తున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తాము రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ పై ధీమా వ్యక్తం చేస్తోంది భారత్ బయోటెక్.

ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని చెబుతున్న భారత్ బయోటెక్ ఒకవేళ ఎవరికైనా దీనివల్ల తీవ్రస్థాయిలో దుష్పరిణామాలు కలిగితే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమని పేర్కొంటుంది.

అయితే ఆ పరిణామాలు వ్యాక్సిన్ కారణంగానే అని నిరూపితమైతేనే తాము ఈ పరిహారం అందిస్తామని స్పష్టం చేస్తుంది.

ఇందుకు గాను కొవాగ్జిన్ టీకా తీసుకునే వారు భారత్ బయోటెక్ విధివిధానాలకు అంగీకరిస్తున్నట్టు పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందనే కండీషన్ కూడా పెట్టింది.అంటే ఈ వ్యాక్సిన్ కారణంగా ప్రాణాలు కోల్పోతే ఆ మరణించిన కుటుంబానికి ఈ సంస్ద ఆర్ధిక సహాయం చేస్తుందన్న మాట.ఒకరకంగా ఈ వ్యాక్సిన్ వేసుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే అని అనుకుంటున్నారట ఈ విషయం విన్న వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube