పెట్రో సెగ.. దేశ వ్యాప్తంగా బంద్..!!

రోజురోజుకీ దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రేడ్ యూనియన్లు దేశ వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చాయి.దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని అదేరీతిలో దేశవ్యాప్తంగా ఒకే ఇంధన ధరలు ఉండాలని డిమాండ్ చేస్తూ నేడు భారత్ బంద్ పాటిస్తున్నాయి. 

 Bharat Bandh Today For Against Increasing Fuel Rates, Trade Unions,bharath Bandh-TeluguStop.com

బంద్ కార్యక్రమంలో భాగంగా సీఏఐటి చక్కా జామ్ కు పిలుపునిచ్చింది.  దేశవ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల వాహనాలు నిలిపివేస్తున్నట్టుగా సీఏఐటి ప్రకటించింది.  దాదాపు దేశ వ్యాప్తంగా 1500 ప్రాంతాలలో నిరసనలు తెలియజేస్తున్నారు.దీనికి మద్దతుగా దేశంలో 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి.

ముఖ్యంగా ఈ బంద్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా లారీ యూనియన్ లు తీసుకున్నాయి.అదేవిధంగా అఖిలభారత రవాణా సంక్షేమ సంఘం కూడా పాల్గొంటున్నట్లు కార్మిక వర్గాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా గ్యాస్ మరియు ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ నియమాలలో మార్పులు చేస్తున్న తరుణంలో.దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఒకేరీతిగా ఉండాలని, జిఎస్టి నియమాల్లో పునఃసమీక్షించాలని నిరసన తెలియజేయడానికి ట్రేడ్ వర్గాల యూనియన్లు రెడీ అయ్యాయి.

Telugu Bharath Bandh, Cait, Chakka Jam, Lorry, Petrol Rates, Trade-Latest News - .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube