శ్రీవారిని ఆ నక్షత్రం రోజున దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం..!

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు.

 Pray Lord Venkateswara On Bharani Nakshtatram, Bharani Nakshatra, Sri Venkateswara Swamy, Saturday Pooja, Hindu Rituals, Hindu Pooja-TeluguStop.com

రోజు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.కానీ భరణి నక్షత్రంలో పుట్టిన వారు శ్రీవారిని దర్శించుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అలాంటి శనివారం రోజున భరణి నక్షత్రం వస్తే ఆరోజు శ్రీవారిని దర్శించుకుంటే శుభఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

 Pray Lord Venkateswara On Bharani Nakshtatram, Bharani Nakshatra, Sri Venkateswara Swamy, Saturday Pooja, Hindu Rituals, Hindu Pooja-శ్రీవారిని ఆ నక్షత్రం రోజున దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం గౌతముడు అనే మహా తపస్వీకి తన మరణానంతరం ఉత్తమ లోకాలను పొందాలనే ఆలోచన రావడంతో విశ్వజిత్ అనే మహా యాగాన్ని ఆచరిస్తాడు.యజ్ఞం చేసే సమయంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటాడు.

అందులో భాగంగానే చివరగా గోదానం చేయాల్సి వస్తుంది.

ఇంతలో గౌతముని కుమారుడు నచికేతుడు గోశాలలో ఉన్న గోవులు అన్ని ఏ మాత్రం ఓపిక లేకపోవడంతో, ఇలాంటి గోవులను బ్రాహ్మణులకు దానం చేస్తే పుణ్యం రాకపోగా,పాపం వస్తుందని భావించి ఎలాగైనా గోదానం ఆపాలని ప్రయత్నిస్తాడు.

ఇందులో భాగంగానే తన తండ్రి దగ్గరకు వెళ్లి ఈ యజ్ఞం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు ఈ యాగం వల్ల ఎన్నో దానాలు చేశారు మరి నన్ను ఎవరికి దానం చేస్తావు, అని తన తండ్రిని అడుగుతాడు.

ఇలా పలుమార్లు తన తండ్రిని విసిగించిన నచికేతుడుకి గౌతముడు ఎంతో నేర్పుగా అలాంటి ప్రశ్నలు అడగకూడదు నాయనా అని నచ్చ చెప్పి పంపిస్తాడు.కానీ పలుమార్లు నచికేతుడు విసిగించడం తో నిన్ను యమధర్మరాజుకు దానంగా ఇస్తానని గౌతముడు చెబుతాడు.ఇంతలోనే యమధర్మరాజు నచికేతుడిని తీసుకువెళ్లడానికి సిద్ధమవుతాడు.

నచికేతుడు యమధర్మ రాజుకు నమస్కరించి ఆత్మ స్వరూపం, జన్మ జన్మ రహస్యం చెప్పవలసిందిగా యమధర్మరాజు ప్రార్థిస్తాడు.ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదని ధర్మరాజు నచికేతునికి తెలియజేస్తాడు.

నచికేతుడి విద్యా జ్ఞానాన్ని నిర్వహించిన యమధర్మరాజు జన్మ రహస్యాన్ని నచికేతునికి తెలియజేస్తాడు.

ఎవరైతే నక్షత్రాలలో రెండవ నక్షత్రమైన భరణి నక్షత్రము నందు జన్మిస్తారో అలాంటి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల అకాల మృత్యువు భయం తొలగిపోతుంది.

అందుకు కారణం భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిపతి.ఆ నక్షత్రం ఉన్న వారు బ్రహ్మ ముహూర్తం లో స్వామి వారిని దర్శించుకోవడం వల్ల యమగండం తొలగిపోతుంది.

అంతేకాకుండా భరణి నక్షత్రం రోజున కుజుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రార్థిస్తాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube