మరో తెలుగు సీరియల్ హీరో కి కరోనా వైరస్ పాజిటివ్…  

Bharadwaj, telugu serial actor, Corona virus positive, Tollywood, Swathi chinukulu, Bandham - Telugu Bandham, Bharadwaj, Corona Virus Positive, Swathi Chinukulu, Telugu Serial Actor, Tollywood

ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు ఈ కరోనా వైరస్ బారినపడి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండగా మరో సీరియల్ నటుడు భరద్వాజ్ కి కరోనా వైరస్ సోకినట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా  ఓ వీడియోని షేర్ చేస్తూ తెలిపాడు.

 Bharadwaj Corona Virus Positive

అయితే ఇందులో భాగంగా ఇటీవల తాను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నానని ఈ ప్రక్రియలో తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపాడు.అలాగే తనకు కరోనా వైరస్ లక్షణాలయిన జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి లేవని కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  చెప్పుకొచ్చాడు.

అంతేగాక తనతో పాటు ఇన్ని రోజులు షూటింగుల్లో పని చేసినటువంటి ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఈ వీడియో ద్వారా తెలిపాడు.అలాగే ముందుగా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ గురించి నెగిటివ్ వార్తలని ప్రచారం చేయవద్దని వైద్యుల సలహా మేరకు సూచనలు మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టవచ్చునని తెలిపాడు.

మరో తెలుగు సీరియల్ హీరో కి కరోనా వైరస్ పాజిటివ్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో భరద్వాజ్ ఇటీవల ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన టువంటి జయ జానకి నాయక అనే చిత్రంలో ప్రముఖ విలన్ తమ్ముడి పాత్రలో నటించాడు.ప్రస్తుతం భరద్వాజ్ స్వాతి చినుకులు, బంధం, తదితర సీరియళ్ళలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

#Bandham #Bharadwaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bharadwaj Corona Virus Positive Related Telugu News,Photos/Pics,Images..