చిన్న సినిమాకు టైటిల్ తంటా!

టాలీవుడ్‌లో ఇటీవల సినిమా టైటిల్ విషయాల్లో చాలానే రచ్చ జరుగుతోంది.మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

 Bhanumathi Ramakrishna Movie Title Lands In Trouble, Bhanumathi Ramakrishna, Bio-TeluguStop.com

తమ అనుమతి లేకుండా ఆ సినిమాకు టైటిల్‌ను ఎలా పెడతారని వారు చిరు అండ్ టీమ్‌పై మండిపడ్డారు.ఒక సందర్భంలో ఈ సినిమాపై వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో చిరు అండ్ టీమ్ తమ సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టారు.కాగా ఇఫ్పుడు ఓ చిన్న సినిమాకు కూడా ఇలాంటి సమస్య వచ్చి పడింది.

తాజాగా టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు.ఈ సినిమాలో ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాకు అలనాటి లెజెండరీ నటి భానుమతి రామకృష్ణ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

తమ అనుమతి లేకుండా ఈ సినిమాకు ఆమె పేరును ఎలా పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ సినిమాలో ఆమె పేరుకు భంగం కలిగే సన్నివేశాలు ఏవైనా ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు.దీంతో భానుమతి రామకృష్ణ చిత్ర యూనిట్, వారికి ప్రత్యేకంగా ఓ ప్రీమియర్ షో చూపించి సినిమాలో అలాంటి సీన్స్ లేవని నిరూపించుకోవాలని చూస్తున్నారు.

శ్రీకాంత్ నగోతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సలోని లుథ్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube