మద్దెలచెరువు సూరి హత్య కేసు : భానుకిరణ్ కి యావజ్జీవ శిక్ష

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసుపై మంగళవారం నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

 Bhanukiran Sentenced To Life Imprisonment-TeluguStop.com

అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.ఇదే కేసులో మరో నిందితుడు మన్మోహన్‌సింగ్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది.ఇంతకీ విషయం ఏంటి అంటే…? మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరిలో హైదరాబాద్‌లోని నవోదయ కాలనీలో హత్యకు గురయ్యారు.

సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్‌ తుపాకీతో కాల్చి పరారయ్యాడని మధుమోహన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ కేసును మొదట బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు.సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్‌ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.తుపాకుల అక్రమ తయారీ కేసులో అతడితోపాటు మరో ముగ్గురికి నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube