బిగ్‌బాస్‌ : అరియానాను భయపెట్టిన జలజ ఎవరంటే..!

తెలుగు బిగ్‌ బాస్‌ ఈ వారం దెయ్యంతో ఆట టాస్క్‌ను ఇచ్చాడు.ఈ టాస్క్‌లో భాగంగా ఎప్పుడు లేనిది ఇంట్లో బిగ్‌ బాస్ కాకుండా మరొకరు వాయిస్‌ తో కమాండ్‌ చేశాడు.

 Bhanu Sri Is The Ghost In Bigg Boss House , Bhanu Sri, Karate Kalyani, Ariyana,-TeluguStop.com

ఆ లేడీ వాయిస్‌ ఎవరిది దెయ్యంగా కనిపించినది ఎవరు అంటూ అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.మొన్నటి ఎపిసోడ్‌ లో అరియానాకు దెయ్యంగా అద్దంలో కనిపించడంతో పాటు రెండు మూడు సార్లు కూడా దెయ్యం కనిపించింది.

దెయ్యం గెటప్‌ వేసుకున్న అమ్మయిని ఎక్కడో చూసినట్లుగా ఉందని కంటెస్టెంట్స్ అనుకున్నారు.ఇక మాటలు కూడా చాలా సార్లు విన్న మాటల మాదిరిగా ఉన్నాయి కదా అన్నట్లుగా బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ అనుకోవడం జరిగింది.

ఇక వాయిస్‌ విషయానికి వస్తే కరాటే కళ్యాణి అంటూ మొదట ప్రచారం జరిగింది.కాని ఇప్పుడు అద్దంలో కనిపించిన దెయ్యం మరియు బిగ్‌ బాస్‌ స్థానం నుండి మాట్లాడిన మాటలు రెండు కూడా భాను శ్రీ అంటూ సమాచారం అందుతోంది.

Telugu Abhijith, Ariyana, Bb Jalaja, Bhanu Sri, Bigg Boss, Sohel Akhil-Movie

మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌ బాస్‌ గత సీజన్‌ కు చెందిన భాను శ్రీను ఈ దెయ్యం గెటప్‌ కోసం తీసుకు రావడం జరిగింది అంటున్నారు.జలజ పేరుతో ఆమెను ఇంటి సభ్యులందరిని కూడా భయపెట్టేందుకు ఉపయోగించారు. భాను శ్రీ వాయస్‌ చాలా గంభీర్యంగా ఉంటుంది.ఆ వాయిస్‌ కారణంగానే జలజ వాయిస్‌ కు ఆమె వాయిస్‌ బాగా సెట్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో గత సీజన్‌ కంటెస్టెంట్‌ అయిన భాను శ్రీ చేసిన అలజడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్‌ మరియు సోహెల్‌ ల భయం అందరిని నవ్వు తెప్పించింది.

ముఖ్యంగా ప్రోమోలో వారిని చూపించిన తీరు హైలైట్‌ గా అనిపించింది.చాలా వారాల తర్వాత ఒక మంచి ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఎపిసోడ్‌ ను చూశాం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube