వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది శాంతి ప్రియ. తొలి సినిమాలో సుచిత్ర క్యారెక్టర్ చేసింది.
తన ఫస్ట్ మూవీతోనే ఎంతో మంచి గుర్తింపు పొందింది.తన అందం, అభినయంతో ఎంతో మంచి అభిమానులను సంపాదించుకుంది.
ఆ అందాల తార మరెవరో కాదు.స్వయంగా స్టార్ హీరోయిన్ భాను ప్రియ చెల్లి.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా తన అందచందాలతో ఎంతగానో ఆకట్టుకుంది.కొంతకాలం పాటు తన గ్లామర్ పాత్రలతో జనాలను అలరించిన ఆమె.ఆ తర్వాత సినిమా పరిశ్రమకు దూరం అయ్యింది.తన చివరి సినిమా అక్షయ్ కుమార్ సరసన ఇక్కే పే ఇక్కా సినిమాలో యాక్ట్ చేసింది.
ఆమె బాలీవుడ్ కు పరిచయం అయ్యింది కూడా సౌగంధ్ అనే అక్షయ్ కుమార్ సినిమాతోనే కావడం విశేషం.
శాంతిప్రియ 1969 సెప్టెంబర్ 22న రాజమండ్రిలో జన్మించంది.
తన 18వ ఏట ఎంగ ఊరు పాట్టుకరన్ అనే తమిళ సినిమాతో సినీ రంగంలోకి వచ్చింది.అందులో రామరాజన్ హీరోగా చేశాడు.ఆ తర్వాత మహర్షి సినిమాతో తెలుగులోకి వచ్చింది.1995లో ఆమె సిద్ధార్థ్ రేను వివాహం చేసుకుంది.కానీ 2004లో సిద్ధార్థ్ చనిపోయాడు.ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కొడుకులు.వారిని తనే పెంచుతుంది.
మహర్షి సినిమా తర్వాత జగపతి బాబు హీరోగా సింహ స్వప్నం అ సినిమాలో నటించింది.ఆ తర్వాత రాజశేఖర్‌తో కలిసి యమపాశం, శిలాశాసనం సినిమాలు చేసింది.నాగార్జునతో అగ్ని, రమేశ్ బాబుతో కలియుగ అభిమన్యుడు, నరేశ్‌తో జస్టిస్ రుద్రమదేవి సినిమాలు చేసింది.
అనంతరం బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు.పెళ్లి తర్వాత కొన్ని సీరియల్స్ చేసింది.
అటు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుది శాంతిప్రియ.అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.తాజా ఓ ఇంటర్వ్యూలో తాను మళ్లీ సినిమాల్లో నటించాలి అని భావిస్తున్నట్లు చెప్పింది.సెకెండ్ ఇన్నింగ్స్ లో మరోసారి తన నటననా శక్తిని నిరూపించుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పింది.
తనుకు రెండో ఇన్నింగ్స్ చాన్స్ వస్తుందో లేదో వేచి చూడాలి.తనకు మంచి అవకాశాలు రావాలని మనమూ కోరుకుందాం.