సీనియర్‌ హీరోయిన్‌ అరెస్ట్‌ కాబోతుందా?  

Bhanu Priya Is Going To Be Arrested For Hiring Child Labour - Telugu Bhanu Priya, Case On Bhanu Priya, Hiring Child Labour, Telugu Tollywood Boxoffice, Viral In Social Media

తెలుగు సినిమాలో 1980లలో హీరోయిన్‌గా నటించి అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన భానుప్రియ ఇప్పుడు కూడా అడపా దడపా చిత్రాల్లో నటిస్తూనే ఉంది.చెన్నైలో నివాసం ఉండే భానుప్రియ కొన్నాళ్ల క్రితం బాల కార్మికుల చట్టం కేసులో చిక్కుకున్న విషయం తెల్సిందే.

Bhanu Priya Is Going To Be Arrested For Hiring Child Labour

భానుప్రియ ఇంట్లో ఒక మైనర్‌ బాలిక పని చేస్తూ ఉండేది.ఆ అమ్మాయి ఇంట్లోని బంగారం దోచేసింది అంటూ భానుప్రియ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆలోచన లేకుండా పోలీసులకు అతడు ఫిర్యాదు చేయడంతో ఆ అమ్మాయి మైనర్‌ బాలిక అని, ఆ అమ్మాయిని బలవంతంగా ఇంట్లో ఉంచుకుని పని చేయించుకుంటున్నారు అంటూ భానుప్రియపై రివర్స్‌ కేసు నమోదు అయ్యింది.

సీనియర్‌ హీరోయిన్‌ అరెస్ట్‌ కాబోతుందా-Movie-Telugu Tollywood Photo Image

 బంగారం పోయిన కేసులో బాలికను ప్రశ్నించిన పోలీసులు ఆమె తల్లిపై కూడా కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.ఇదే సమయంలో భాను ప్రియ మైనర్‌ బాలికను తన ఇంట్లో పనికి పెట్టుకున్నందుకు గాను బాల కార్మీక చట్టం కింద ఆమెపై కేసు నమోదు అయ్యింది.గత కొన్నాళ్లుగా ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులు దాదాపు రెండున్న సంవత్సరాలుగా ఆ మైనర్‌ బాలిక భాను ప్రియ ఇంట్లో పని అమ్మాయిగా చేస్తుందని నిర్దారణకు వచ్చి చార్జ్‌షీట్‌ను తయారు చేయడం జరిగింది.

 కేసు విషయమై భాను ప్రియను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు.చెన్నై పోలీసులు ఇప్పటికే ఒక సారి భానుప్రియకు నోటీసులు పంపించడం జరిగింది.మైనర్‌ బాలికను నిర్బందించి పని చేయించుకున్న కారణంగా మిమ్ములను అరెస్ట్‌ చేయాలి.మీరు పోలీసుల వద్దకు వచ్చి లొంగి పోవాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది.అయితే భాను ప్రియ మాత్రం ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తుంది.బెయిల్‌ వచ్చిన తర్వాత ఆమె లొంగిపోయే అవకాశం ఉందని లేదంటే పోలీసులు అరెస్ట్‌ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు