ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ అయిన భానుప్ర‌కాశ్ ఎవ‌రు…!  

Bhanu Prakash became Hot topic in AP BJP, AP, Bhanu Prakash, hot topic, Balli Durga Prasad, Tirupathi MP, died, By election, YSRCP, Bhanapaka Lakshmi, Tirupathi Elections, Parlment, Bhanu Prakash Speed - Telugu Ap, Balli Durga Prasad, Bhanapaka Lakshmi, Bhanu Prakash, Bhanu Prakash Speed, By Election, Hot Topic, Tirupathi Elections, Tirupathi Mp, Ysrcp

రాష్ట్రంలో ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఖాళీ అయింది.వైసీపీ ఎంపీ.

TeluguStop.com - Bhanu Prakash Became Topic In Ap Bjp

బ‌ల్లి దుర్గాప్ర‌సాద్.అనారోగ్య కార‌ణంగా ‌మృతి చెందిన నేప‌థ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.అయితే, దీనికి స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ నాయ‌కులు ఈ సీటుపై క‌న్నేశారు.ఈ క్ర‌మంలో ఆది నుంచి కూడా తిరుప‌తిలో అంతో ఇంతో ప‌ట్టున్న బీజేపీ పుంజుకునేందుకు ఈ అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.ఈ క్ర‌మంలో ఉప ఎన్నిక‌ల విష‌యాన్ని బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

తిరుప‌తిలో గ‌తంలో రెండు సార్లు ఎంపీ స్తానాన్ని కూడా బీజేపీ త‌న ఖాతాలో వేసుకుంది.ఈ క్ర‌మంలో ఇక్క‌డ మ‌రోసారి పోటీ చేసి.గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తోంది.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పార్టీలో కీల‌కంగా ఉన్న తిరుప‌తి నాయ‌కుడు భాను ప్ర‌కాశ్ రెడ్డి సూచించిన వ్య‌క్తికి ఈ టికెట్ ఇవ్వాల‌ని పార్టీ నాయ‌క‌త్వం నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

TeluguStop.com - ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ అయిన భానుప్ర‌కాశ్ ఎవ‌రు…-Political-Telugu Tollywood Photo Image

పైగా టీడీపీ అభ్య‌ర్థిని నిల‌బెట్టే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.దీనికితోడు.

లోపాయికారీగా బీజేపీకి కూడా స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంది.ఈ ప‌రిణామాల‌తో బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్న నాయ‌కులు ఇప్పుడు భాను ప్ర‌కాశ్‌రెడ్డివైపు చూస్తున్నారు.

అవ‌స‌ర‌మైతే.ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న‌ ప‌న‌బాక ల‌క్ష్మిని పార్టీలోకి ఆహ్వానించి ఆమెకు టికెట్ ఇవ్వాల‌ని కూడా బీజేపీ నేత‌లు యోచిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.దీనికి భాను ప్ర‌కాశ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నార‌ని, ఇటీవ‌ల ప‌రిణామాల‌తో పార్టీ గ్రాఫ్ పుంజుకుంద‌ని, ముఖ్యంగా సీఎం తిరుమ‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు కూడా విజ‌య‌వంతం కావ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.ఏదేమైనా తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వేళ భానుప్ర‌కాశ్ ప్ర‌స్తుతం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారారు.

ఈ స‌మయంలో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.విజ‌యం త‌ధ్య‌మ‌ని భావిస్తున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

#Hot Topic #By Election #Bhanu Prakash #BhanuPrakash #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bhanu Prakash Became Topic In Ap Bjp Related Telugu News,Photos/Pics,Images..